Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాల్ టాంపరింగ్ ఎంత పని చేసింది? వార్నర్ భార్యకు రెండు సార్లు గర్భస్రావం

David Warners wife Candice suffered two miscarriages during ball-tampering ban

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన సంఘటనల్లో ఒకటి. ఈ ఘటనలో ఆసీస్ క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లకు ఏడాది... కామెరూన్ బాన్‌క్రాప్ట్‌కు తొమ్మిది నెలలు నిషేధం విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ 12 నెలల నిషేధం ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంతో మార్చింది.

అయితే, అదే 12 నెలలు తన జీవితంలో ఎంతో విషాదాన్ని కూడా నింపింది. తన నిషేధిత సమయంలో వార్నర్ భార్యకు రెండు సార్లు గర్భస్రావం జరిగింది. దీనిపై వార్నర్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఈ విషయాన్ని వెల్లడించింది ఎవరో కాదు డేవిడ్ వార్నరే. ఆ కుటుంబంలోకి మళ్లీ ఇప్పుడు సంతోషం వచ్చింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వార్నర్ మళ్లీ తండ్రి కాబోతున్నాడు. ఈ ఆదివారం వార్నర్ భార్య క్యాండిస్‌ మూడో బిడ్డకు జన్మనివ్వనుంది. డేవిడ్ వార్నర్ ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నాడు. ఈ టోర్నీలో 500 పరగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

తన భార్య మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్న తరుణంలో వార్నర్ మాట్లాడుతూ "నిషేధ సమయంలో క్యాండిస్‌కు రెండుసార్లు గర్భస్రావం కావడం దురదృష్టకరం. ఇప్పటికే నా ఒడిలో మరో బిడ్డ ఉండాల్సింది. మళ్లీ తండ్రి కాబోతున్నాను. అయినా నా ధ్యాసంతా క్రికెట్‌పైనే. మాకు ఇద్దరు ఆరోగ్యకరమైన చిన్నారులు ఉన్నందుకు సంతోషిస్తున్నాం. ఆదివారం మరొకరు రావొచ్చు" అని వార్నర్ అన్నాడు.

Story first published: Friday, June 28, 2019, 16:53 [IST]
Other articles published on Jun 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+