
డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత
లంచ్ విరామానికి ముందు సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా వార్నర్ అరుదైన ఘనత తనఖాతాలో వేసుకున్నాడు. గతంలో ట్రంపర్ (1902), చార్లెస్ మకార్ట్నే(1926), డాన్ బ్రాడ్ మన్(1930), మాజిద్ ఖాన్(1976)లో ఈ ఘనతను సాధించారు. 1930లో లీడ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డాన్ బ్రాడ్‌మన్ లంచ్ విరామానికి ముందు 105 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు.

17 ఫోర్ల సాయంతో 113 పరుగులు
ఆ టెస్టులో బ్రాడ్‌మన్ 334 పరుగులతో ట్రిపుల్ సెంచరీ చేశాడు. కాగా, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన రెండో టెస్టులో 143 బంతుల్లో వార్నర్ 144 పరుగులు చేశాడు. సిడ్నీ టెస్టులో 95 బంతులను ఎదుర్కొన్న వార్నర్ 17 ఫోర్ల సాయంతో 113 పరుగులు చేసి వహాబ్ రియాజ్ బౌలింగ్ లో సర్ఫరాజ్ అహ్మద్‌కి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.

వీరేంద్ర సెహ్వాగ్ అధిగమించలేని వార్నర్
అయితే ఈ టెస్టులో పలు రికార్డులను నెలకొల్పే క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నెలకొల్పిన ఓ రికార్డును మాత్రం వార్నర్ అధిగమించలేకపోయాడు. 2006లో వెస్టిండీస్‌తో సెయింట్ లూసియాలో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్ 25.3 ఓవర్లలో సెంచరీ మార్కును చేరగా, తాజా టెస్టులో వార్నర్ మాత్రం మొదటి ఇన్నింగ్స్ 26.2 ఓవర్లలో సెంచరీ సాధించాడు.

లంచ్ సమయానికి సెహ్వాగ్ 99 పరుగులతో
ఇన్నింగ్స్‌లో ఓవర్లు పరంగా సెహ్వాగ్ 'అత్యంత వేగవంతమైన' రికార్డుని అందుకు క్రమంలో వార్నర్ ఐదు బంతులు ముందు నిలిచిపోయాడు. సిడ్నీ టెస్టులో వార్నర్ లంచ్ విరామ సమయానికి ముందే సెంచరీ చేయగా, అప్పటి వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్ లంచ్ సమయానికి 99 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

113 పరుగుల వద్ద వార్నర్, 180 పరుగుల వద్ద సెహ్వాగ్
ఇక, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 113 పరుగుల వద్ద అవుటైతే, అప్పటి మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 180 పరుగుల వద్ద టీ బ్రేక్ విరామం తర్వాత పెవిలియన్‌కు చేరాడు.


Click it and Unblock the Notifications