'వార్నర్ ఓ మంచి ఇన్నింగ్స్ ఆడితే చాలు... ఆసీస్ యాషెస్ గెలుస్తుంది'

హైదరాబాద్: ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ మంచి ఇన్నింగ్స్ ఆడితే ఆస్ట్రేలియా యాషెస్ సిరిస్‌ను సొంతం చేసుకుంటుందని ఆసీస్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నారు. ఇంగ్లీషు గడ్డపై జరుగుతున్న ఈ సిరిస్‌లో ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడి ఒకే అర్ధసెంచరీ చేసిన డేవిడ్ ఘోరంగా విఫలమయ్యాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో వార్నర్ ఆరుసార్లు బ్రాడ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.
ఈ సిరిస్‌లో డేవిడ్ వార్నర్ చేసిన పరుగులు 2, 8, 3, 5, 61, 0, 0, 0. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వార్నర్ ప్రదర్శనపై తనకు ఎలాంటి ఆందోళన లేదని జస్టిన్ లాంగర్ చెప్పుకొచ్చాడు. అతడొక వరల్డ్ క్లాస్ ప్లేయరని కొనియాడాడు. వార్నర్ ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడితే ఆస్ట్రేలియా గెలుపు తథ్యమని లాంగర్ అన్నాడు.
"మాకు తెలుసు వార్నర్ ఎలాంటి ఆటగాడో. అతడు కొత్తగా నిరూపించుకోవడానికి ఏమి లేదు. అతడో వరల్డ్ క్లాస్ ప్లేయర్. కానీ, ఈ సిరీస్‌లో రాణించడానికి వార్నర్‌కు ఓవల్ టెస్టు మంచి అవకాశం. అతడి నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నాం. వార్నర్ చెలరేగితే ఆస్ట్రేలియా తప్పక విజంయ సాధిస్తుంది" అని హెడ్ కోచ్ లాంగర్ తెలిపాడు.
ఇదిలా ఉంటే, లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టుల్లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల్లో గెలువగా, ఇంగ్లాండ్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా 2-1తో యాషెస్ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకోగా... ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే 18 ఏళ్ల తర్వాత ఇంగ్లీషు గడ్డపై యాషెస్ టెస్టు సిరిస్ నెగ్గుతుంది. చివరగా 2001లో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 4-1తో సిరీస్ గెలిచింది.
ఆ తర్వాత గ్రెగ్ చాపెల్, రీకీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్‌ల సారథ్యంలోని రెండేసి సార్లు ఇంగ్లాండ్‌లో పర్యటించినా.. యాషెస్ ట్రోఫీని గెలవలేకపోయారు. అలాంటిది అనుకోకుండా కెప్టెన్ అయిన పైన్ ముంగిట ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం చివరి మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications