For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి సారి కామెంటేటర్ అవతారంలో డేవిడ్ వార్నర్

David Warner Roles Up His Sleeves For Commentary Duties During England-Australia ODI Series

హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టు నిషేదిత క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెరమీదికి కొత్త అవతారంలో కనిపించనున్నాడు. బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేదం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇది మరో అవకాశం. ఈ నెలలో ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేల సిరీస్‌, ఒక టీ20 మ్యాచ్‌ నిమిత్తం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ దూరమైన వార్నర్‌ తొలిసారిగా ఈ సిరీస్‌కు కామెంటేటర్‌‌గా పనిచేయనున్నాడు.

దీనిలో భాగంగా ఛానెల్‌-9కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు తెలిసింది. టీమ్ పెయిన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్‌లో ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్ వేదికగా బుధవారం తొలి వన్డే జరగనుంది. జూన్‌ 16న జరగనున్న రెండో వన్డేకు వార్నర్‌ కామెంట్రీ బృందంతో వచ్చి చేరనున్నాడు. శనివారం కార్డిఫ్‌లో జరగనున్న రెండో వన్డేలో వార్నర్ కామెంట్రీ బాక్స్‌లో దర్శనం ఇవ్వనున్నాడు.

ఈ సిరీస్ తర్వాత స్మిత్‌తో కలిసి కెనడాలో ప్రారంభం కానున్న గ్లోబల్ టీ20 టోర్నీలో ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ కూడా ఆడనున్నాడు. జూన్ 28 నుంచి జూలై 15 తేదీల మధ్య ఈ టోర్నీ జరగనుంది. నిషేదానికి గురైన తర్వాత సతీసమేతంగా మీడియా సమావేశంలో పాల్గొన్న వార్నర్ భావోద్వేగానికి గురైయ్యాడు. ఈ మనస్ఫర్థలు కారణంగా అప్పుడు గర్భిణీగా ఉన్న అతని భార్యకు గర్భస్రావం జరిగింది.

మార్చి నెలలో కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్‌ ఓపెనర్‌ బెన్‌క్రాఫ్ట్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనితో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు కూడా సంబంధం ఉందని తేలడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా స్మిత్‌, వార్నర్‌పై ఏడాది, బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలలపాటు నిషేధం విధించింది.

Story first published: Monday, June 11, 2018, 9:30 [IST]
Other articles published on Jun 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+