అందుకే టిక్‌టాక్ వీడియోలు చేశా: డేవిడ్ వార్నర్

సిడ్నీ: కరోనా వైరస్‌ కట్టడికి ప్రపంచదేశాలన్నీ మొన్నటి వరకు లాక్‌డౌన్ పాటించిన విషయం తెలిసిందే. ఈ ఊహించని విరామంతో క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన సతీమణి క్యాండిస్‌తో కలిసి టిక్‌టాక్‌ వీడియోలతో అలరించాడు. అది కూడా తెలుగు పాటలకు చిందేసి తెలుగు అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. ప్రతీ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బ్యాటింగ్‌తో అలరించే ఈ విధ్వంసకర ఓపెనర్.. ఈ సారి మాత్రం టిక్‌టాక్‌తో ఎంటర్‌టైన్ చేశాడు.

చిరునవ్వుల కోసమే..

చిరునవ్వుల కోసమే..

తెలుగు పాటల టిక్‌టాక్ వీడియోలతో పాపులారిటీ సంపాదించిన వార్నర్ దంపుతులు.. ఆయా చిత్రాల హీరోలు, డైరెక్టర్ల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక టాలీవుడ్ డైరక్టర్ పూరిజగన్నాథ్ అయితే వార్నర్‌కు సినిమా ఆఫర్ కూడా ఇచ్చాడు. తాజాగా ఇండియా టూడేతో మాట్లాడిన వార్నర్ ఆ వీడియోలు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాడు.

ప్రజల ముఖాలపై చిరునవ్వులు తేవడానికే ఈ ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నాడు.

'మన ఆలోచనా పరిధిని మించి ఆలోచించాలి. నేనా వీడియోలు ఎందుకు చేశానంటే.. ఈ కష్ట సమయాల్లో ప్రజల ముఖాలపై చిరునవ్వులు తీసుకురాడానికే. టిక్‌టాక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా నేనూ, నా కుటుంబసభ్యులు ఆ వీడియోలు చేయగలిగాం' అని వార్నర్‌ తెలిపాడు.

అసలు ఇవేంటి..?

అసలు ఇవేంటి..?

భారతీయ సినిమాలపై స్పందించమని వార్నర్‌ను కోరగా.. ‘నిజం చెప్పాలంటే ఇక్కడ మీరు పేర్కొనే బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ అంటే ఏంటి? నాకు అస్సలు తెలియదు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. అయితే, మేం తొలుత అభిమానులతో ముచ్చటించి వారికేం కావాలనే విషయాన్ని అడిగేవాళ్లం. దేన్నైనా అనుకరిస్తూ డాన్స్‌ చేసే వాటి గురించి ప్రశ్నించేవాళ్లం. దాంతో మాకు చాలా మంది తమ అభిప్రాయాలు చెప్పేవాళ్లు. అలా మేం చేసిన తొలి పాట 'బుట్టబొమ్మా' డాన్స్‌ వీడియో. ఆ తర్వాత వరుసగా వీడియోలు చేశాం. అభిమానులు అడిగిన వాటికి వీలైనన్ని డాన్సులు చేసి అలరించాం. అది చాలా వినోదాత్మకంగా సాగింది. మేమెంతో ఆస్వాదించాం' అని పేర్కొన్నాడు.

చాలా కష్టం అబ్బా...

చాలా కష్టం అబ్బా...

అయితే, భారతీయ పాటలకు స్టెప్పులు చాలా కష్టతరమని, వాటిని చేయాలంటే చాలా శ్రద్ధ పెట్టాలని చెప్పాడు. 'నేను క్రికెటర్‌ని అయినందుకు సంతోషిస్తున్నా. ఆ స్టెప్పులు చాలా త్వరగా చేయాల్సి ఉంటుంది. ఇంకా కష్టతరం కూడా. ఎంతో సమయాన్ని తీసుకుంటాయి' అని వార్నర్‌ చెప్పుకొచ్చాడు. ఇక బుట్టబుమ్మా నుంచి మొన్నటి గాల్లో తేలే వరుకు వార్నర్ అనేక టిక్ టాక్ వీడియోలు చేశాడు. అచ్చం తెలుగు హీరోల్లానే స్టెప్పులేస్తూ.. అభిమానుల మనసులు దోచుకున్నాడు.

ఐపీఎల్ ఆడుతా..

ఐపీఎల్ ఆడుతా..

ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే తామంతా ఖచ్చితంగా ఐపీఎల్ ఆడుతామని వార్నర్ స్పష్టం చేశాడు. ‘టీ20 ప్రపంచకప్ వాయిదా పడి, ఆ విండోలో ఐపీఎల్ నిర్వహిస్తే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా భారత్‌కు వచ్చి ఐపీఎల్ ఆడుతారని ఖచ్చితంగా చెప్పగలను. ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీలో పాల్గొనే దేశాలకు ఆతిథ్యం ఇవ్వడం సవాల్‌తో కూడుకున్న విషయమే. ఐసీసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. వాయిదా పడి క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి అనుమతి వస్తే ఐపీఎల్ ఆడుతాం'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

ఎందుకు ఎగిరిపడుతున్నారు.. జయవర్ధనే, సంగక్కరలను ప్రశ్నించిన లంక మాజీ మంత్రి

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, June 21, 2020, 12:41 [IST]
Other articles published on Jun 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X