మద్యం తాగితే ఆమె విపరీతంగా కొట్టేది.. సంచలన విషయాలు బయటపెట్టిన వార్నర్!!

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి మనందరికీ తెలిసిందే. మైదానంలో ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడో.. బయట కూడా అంతే దూకుడుగా ఉంటాడు. స్లెడ్జింగ్‌ చేయడం, ప్రత్యర్థి ఆటగాడిని కవ్వించడం మైదానంలో వార్నర్ శైలి. ఇక మైదానం వెలుపల అతిగా మద్యం తాగి గొడవపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే బాల్ టాంపరింగ్‌ అనంతరం మాత్రం వార్నర్ వ్యవహార శైలిలో పూర్తిగా మార్పు వచ్చింది.

కంబాల రేసర్‌ శ్రీనివాస గౌడకు 'సాయ్‌' పిలుపు!!

పబ్‌లో ఘర్షణ:

పబ్‌లో ఘర్షణ:

2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డేవిడ్ వార్నర్ తన దూకుడైన ఆటతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. మ్యాచ్ ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ.. ఒంటిచేత్తో ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. అయితే వార్నర్ తన ఆటతో కంటే వ్యక్తిగత చర్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. మద్యం తాగి గొడవ పడిన ఘటనలు కోకొల్లలు. ముఖ్యంగా 2013లో జరిగిన యాషెస్ సిరీస్‌లో హల్చల్ చేసాడు. ప్రస్తుత ఇంగ్లీష్ టెస్ట్ కెప్టెన్ జో రూట్‌తో బర్మింగ్‌హామ్‌లోని ఒక పబ్‌లో ఘర్షణను దిగాడు. ఏకంగా రూట్‌ని కొట్టి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్నాడు.

 12 నెలుల నిషేధం:

12 నెలుల నిషేధం:

రూట్‌ ఘటన అనంతరం దక్షిణాఫ్రికాలో క్వింటన్ డికాక్‌తో డేవిడ్ వార్నర్ గొడవపడ్డాడు. ఇవన్నీ ఒక ఎత్తు.. బాల్ టాంపరింగ్‌ మరో ఎత్తు. దాదాపు రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాలో బాల్ టాంపరింగ్‌కి పాల్పడి ఏకంగా 12 నెలుల నిషేధం ఎదుర్కొన్నాడు. అయితే ఇవేమి వార్నర్ బ్యాటింగ్‌పై మాత్రం ప్రభావం చూపలేదు. అదిరిపోయేలా రీఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్-12, ప్రపంచకప్‌-2019, యాషెస్ 2019, ద్వైపాక్షిక సిరీస్‌లో దుమ్ములేపాడు. గతేడాదికి గాను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిష్టాత్మక అలెన్‌ బోర్డర్‌ పతకాన్ని దక్కించుకున్నాడు. మోసగాడిగా ముద్ర వేయించుకున్న వార్నర్.. ఆ దేశ క్రికెట్‌ హీరోగా నిలిచాడు.

రెండు చెడు అలవాట్లు:

రెండు చెడు అలవాట్లు:

అలెన్‌ బోర్డర్‌ మెడల్ దక్కడానికి ప్రధాన కారణం వార్నర్ మునుపటితో పోలిస్తే ఎంతో మారిపోవడమే. అయితే ఈ మార్పునకు అసలు కారణం వార్నర్ భార్య క్యాండీస్. తన మద్యపాన సమస్యను అధిగమించడానికి క్యాండీస్ ఎలా సహాయం చేసిందో వార్నర్ తాజాగా ఓ మీడియా సమావేశంలో వెల్లడించాడు. 'గతంలో నాకు రెండు చెడ్డ అలవాట్లు ఉండేవి. ఒకటి మద్యం సేవించడం, రెండోది కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగించడం. చిన్నతనం నుండే ఇవి ఆలవాటైపోయాయి' అని వార్నర్ తెలిపాడు.

తలపై కొట్టేది:

తలపై కొట్టేది:

'రెండు చెడు అలవాట్లపై నేను ఎప్పుడూ చింతించేవాని కాదు. నా జీవితంలోకి వచ్చిన క్యాండీస్ ఆ అలవాట్లని మాన్పించింది. నువ్వు ఎందుకు క్రమశిక్షణతో ఉండవు?, ఎందుకు మద్యం తాగుతున్నావు? అంటూ హెచ్చరించేది. ఎందుకు త్వరగా లేవడం లేదు? అని ప్రశ్నించేది. ఇక మద్యం తాగితే ఒక్కోసారి నా తల వెనక భాగంలో కొట్టేది (నవ్వుతూ). అలా నా భార్య నన్ను కంట్రోల్‌లో పెట్టింది' అని వార్నర్ అన్నాడు.

క్రెడిట్ నా భార్యదే:

క్రెడిట్ నా భార్యదే:

'ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌లలో మద్యం తాగడం ఒక సంస్కృతి. సహచరులందరూ తాగినప్పటికీ క్యాండీస్ మాట వినడం తప్ప నాకు వేరే మార్గం లేదు. తదుపరి స్థాయికి చేరుకోవటానికి ఏం అవసరమో గ్రహించా. నేను ఎక్కడ ఉన్నానో, ఏమి చేస్తున్నానో అర్ధమైంది. మారకపోతే ముందుకువెళ్లలేం అని తెలుసుకున్నా. సరైన సమయంలో నా భార్యను వివాహం చేసుకున్నా. నేను త్యాగాలు చేయకపోతే.. ఈ రోజు ఇక్కడ ఉండకపోవచ్చు. నేను మంచిగా మారిపోయాను. ఈ క్రెడిట్ అంత నా భార్యదే' అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, February 15, 2020, 17:46 [IST]
Other articles published on Feb 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X