Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

David Warner: కోకాకోలా బాటిళ్లను తొలగించి.. మళ్లీ: మరో దుమారానికి తెర తీయబోయి

David Warner removed Coke bottles before starting the Press Conference

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మరో మ్యాచ్ వన్‌సైడ్‌గా ముగిసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం రాత్రి శ్రీలంకతో తలపడిన ఆస్ట్రేలియా..ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చివేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ అలవోకగా అందుకుంది. ఇంకా మూడు ఓవర్లు మిగిలిన ఉండగానే తన పని కానిచ్చేసింది. ఈ క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది కంగారూ టీమ్.

ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఎప్పట్లాగే చెలరేగాడు. తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 42 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్‌లో ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు. అయినప్పటికీ- బౌండరీలో బాది వదిలాడు. అతను చేసిన 65 పరుగుల్లో 40 బౌండరీల రూపంలో వచ్చినవే. గ్లెన్ మ్యాక్స్‌వెల్ విఫలం అయినప్పటికీ.. జట్టు స్కోరుబోర్డు ఎక్కడా తగ్గలేదు. ఆరోన్ ఫించ్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్..సత్తా చాటారు. ఈ విజయంతో గ్రూప్-2లో రెండో స్థానంలో నిలిచింది ఆసీస్.

మ్యాచ్ ముగిసిన అనంతరం డేవిడ్ వార్నర్ అదే ఊపులో కనిపించాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు అటెండ్ అయినప్పుడు.. తన ఎదురుగా ఉన్న కోక్ బాటిళ్లను తొలగించాడు. ఇదివరకు సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇదే తరహాలో కోక్ మూవ్‌మెంట్‌ను గుర్తు చేశాడు వార్నర్. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రొనాల్డో- వాటిని తొలగించి.. పక్కన పడేయడం వల్ల అప్పట్లో కోకాకోలా కంపెనీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. సుమారు నాలుగు బిలియన్ల మేర నష్టాన్ని చవి చూసిందా మల్టీ నేషనల్ కంపెనీ.

ఇప్పుడు తాజాగా డేవిడ్ వార్నర్ కూడా అదే పని చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఏర్పాటు చేసిన టేబుల్ మీద రెండు వాటర్ బాటిల్స్, రెండు కోక్ బాటిల్స్‌ను ఉంచారు స్టాఫ్. ఛెయిర్‌లో సర్దుకుని కూర్చున్న వెంటనే కోక్ బాటిళ్లను తీశాడు. కొద్దిసేపటికి వాటిని మళ్లీ అదే స్థానంలో పెట్టాడు. క్రిస్టియానో రొనాల్డోను గుర్తుచేసుకున్నాడు. ఇఫ్ ఇటీజ్ గుడ్ ఎనఫ్ ఫర్ క్రిస్టియానో, ఇటీజ్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ అంటూ నవ్వుతూ కామెంట్ చేశాడు.

Story first published: Friday, October 29, 2021, 10:04 [IST]
Other articles published on Oct 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+