ఓయ్ రషీద్ ఖాన్.. ఇది అన్యాయం.. నాది కాపీ కొట్టావ్: డేవిడ్ వార్నర్

Rashid Khan As 'Baahubali' in Hilarious video - David Warner Reacts, Viral Post

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన ఆటతో ఎలా అలరిస్తాడో.. సోషల్ మీడియాలో కూడా అదేవిధంగా ఎంటర్‌టైన్ చేస్తాడు. లాక్‌డౌన్‌లో ఫ్యామిలీ‌తో టిక్ టాక్ వీడియోలు చేసి ఆకట్టుకున్న వార్నర్.. అనంతరం స్పూఫ్ వీడియోలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్, టాలీవుడ్ హిట్ సినిమాల ట్రైలర్స్‌ను పలు యాప్‌ల సాయంతో మార్ఫింగ్ చేశాడు.

హీరోల దేహానికి తన ముఖాన్ని జత చేసి ఆ వీడియోలను అభిమానులతో పంచుకున్నాడు. అయితే తాజాగా తన సహచర ఆటగాడు, అఫ్గానిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్ కూడా వార్నర్‌ బాటనే పట్టాడు. దీంతో అతని వీడియోపై డేవిడ్ వార్నర్ అన్యాయమంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. తన గుర్తింపు దొంగలించాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

బాహుబలిగా రషీద్ ఖాన్..

ఇక రషీద్ ఖాన్ డేవిడ్ వార్నర్ తరహాలోనే బాహుబలి ట్రైలర్‌ను స్పూఫ్ చేశాడు. హీరో ప్రభాస్ స్థానంలో తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఆ వీడియోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అంతటితో ఆగకుండా వార్నర్ ఈ సినిమా? హీరో ఎవరో చెబుతావా? అని ప్రశ్నించాడు. దీనికి వార్నర్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘హే రషీద్ ఖాన్ ఇది అన్యాయం అబ్బా.. నన్ను కాపీ కొట్టావ్'అని బదులిచ్చాడు. దాంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళీ తెరకెక్కించిన బాహుబలి రెండు విభాగాలుగా విడుదలై రికార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2021లో..

ఐపీఎల్ 2021లో..

ఇక తదుపరి ఐపీఎల్ సీజన్‌ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు రషీద్ ఖాన్‌ను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కేవలం అనామక క్రికెటర్లను మాత్రం వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ అత్యధికంగా 22 మందిని అంటిపెట్టుకుంది. ఏప్రిల్-మేలో జరిగే తదుపరి సీజన్ ఐపీఎల్‌లో మళ్లీ ఈ ఇద్దరు తమ ఆటతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. ఐపీఎల్ 2020 సీజన్ అనంతరం భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్న వార్నర్.. గ్రోయిన్ ఇంజ్యూరికి గురై.. ఆఖరి వన్డేతో పాటు టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. టెస్ట్ సిరీస్‌లో రిఏంట్రీ ఇచ్చినా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు.

రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ షో..

రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ షో..

ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మంగళవారం ముగిసిన ఆఖరి వన్డేలో రషీద్(48, 4/29) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. దాంతో అఫ్గానిస్థాన్ 36 పరుగులతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0‌తో క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 రన్స్ చేసింది. రషీద్‌తో పాటు కెప్టెన్ అస్గర్(41), నైబ్(36) రాణించారు. అనంతరం ఐర్లాండ్ 47.1 ఓవర్లలో 230కే ఆలౌటైంది. పాల్ స్టిరింగ్(118) వరుసగా రెండో సెంచరీతో మెరిసినా జట్టును గెలిపించలేకపోయాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Wednesday, January 27, 2021, 13:16 [IST]
Other articles published on Jan 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X