న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వార్నర్-డీకాక్ వివాదం: వార్న్ నుంచి వాన్ వరకు ఎవరేమన్నారు

By Nageshwara Rao
David Warner-Quinton de Kock scuffle: From Warne to Vaughan, who said what

హైదరాబాద్: డర్బన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా సాధించిన విజయం కంటే కూడా డేవిడ్ వార్నర్-క్వింటన్ డీకాక్‌ల మధ్య చోటు చేసుకున్న ఘటనే హైలెట్‌గా నిలిచింది. ఈ టెస్టులో నాలుగో రోజైన ఆదివారం మైదానంలో ఏం జరిగిందో తెలియదు గానీ, టీ విరామ సమయంలో వీరిద్దరూ డ్రెస్పింగ్ రూమ్‌కి వెళ్లేటప్పుడు మెట్ల వద్ద తీవ్ర వాగ్వాదానికి దిగారు.

సహచర ఆటగాళ్లు వద్దు వద్దు అని వారిస్తున్నా వార్నర్ దూకుడు ప్రదర్శించాడు. దీనికి డికాక్‌ కూడా దీటుగానే సమాధానం ఇచ్చాడు. అయితే, సహచరులు టిమ్‌ పైన్‌, ఖవాజా, ఓ అధికారి వారిస్తున్నా వినకుండా వార్నర్‌.. క్వింటన్‌ను కొట్టేందుకు దూసుకెళ్లాడు. ఈ గొడవ ఎక్కువవడంతో సఫారీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న ఆ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ బయటకు వచ్చాడు.

ఆ తర్వాత కాసేపటికి కెప్టెన్‌ స్మిత్‌ వచ్చి వార్నర్‌ను డ్రస్సింగ్ రూమ్‌లోకి తీసుకువెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం కింగ్స్ మీడ్ స్టేడియంలో మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోను స్థానిక మీడియా బయటపెట్టడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది. గొడవ ఎలా మొదలైందో అనే విషయంపై విచారణ చేస్తున్నామని, నిజానిజాలు తెలిసేవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు తెలిపారు. ఆటగాళ్ల మధ్య గొడవలు క్రికెట్‌కు మంచివి కాదని హితవు పలికారు.

వ్యక్తిగత దూషణలకు దిగొద్దని ఇంతటితో ఇలాంటివి ఆపేయాలని సూచించారు. ఈ ఘటనపై రెండు క్రికెట్ బోర్డులు, పలువురు మాజీ క్రికెటర్లు స్పందించారు.

వార్నర్-డీకాక్ గొడవపై ఎవరేమన్నారు?

స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్

స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్

మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ గొడవపై స్పందించాడు. క్వింటన్ డికాక్.. డేవిడ్ వార్నర్‌‌ని వ్యక్తిగతంగా దూషించడం వల్లే గొడవ మొదలైందని స్మిత్ పేర్కొన్నాడు. 'మేము మైదానంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో చాలా సంతోషంగా ఉన్నాం. క్వింటన్‌‌తో మాకు ఎటువంటి గొడవ జరుగలేదు. కానీ డికాక్ మాత్రం అతని పరిథి దాటి మాట్లాడాడు. నా దృష్టిలో ఇది చాలా తప్పు. ఇప్పుడు ఇక నిర్ణయం అధికారుల చేతిలో ఉంది. మేం మాత్రం క్రీడాస్పూర్తిని పాటిస్తూ ఆడుతున్నాం' అని స్మిత్ అన్నాడు.

 డుప్లెసిస్, దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్

డుప్లెసిస్, దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్

దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన బాగుండేలా అంపైర్లు తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. 'రెండు వైపుల నుంచి వ్యక్తిగత విమర్శలు, దూషణలు చోటుచేసుకున్నాయని విన్నా. దీన్ని ఎవరు మొదలు పెట్టారో మాత్రం తెలియదు. ఒకవేళ ఇది మైదానంలోనే ప్రారంభమైతే.. దాన్ని మొగ్గదశలోనే తుంచాలి. డ్రెస్సింగ్ రూమ్ వద్ద గొడవ జరుగుతున్న సమయంలో నేను బయటికి వెళ్లి చూశా. వెంటనే డేవిడ్‌ను డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లమని సూచించా. మైదానంలో స్లెడ్జింగ్ విషయంలో బౌండరీలు ఉండాలి' అని చెప్పాడు.

 క్రికెట్ ఆస్ట్రేలియా

క్రికెట్ ఆస్ట్రేలియా

డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగిందని తెలిసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది. గొడవ ఎలా మొదలైందో అనే విషయంపై విచారణ చేస్తున్నామని, నిజానిజాలు తెలిసేవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు తెలిపారు.

క్రికెట్ దక్షిణాఫ్రికా

'డర్బన్ టెస్టులో ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. ఇది గేమ్ యొక్క స్పిరిట్‌ను దెబ్బతీస్తుంది. ఈ సంఘటన జరిగిన రోజునే మ్యాచ్ రిఫరీ ఏం జరిగిందో మాతో చెప్పాడు. ఈ ఘటనపై ఏం నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఐసీసీ సూచన కోసం ఎదురు చూస్తున్నాం' అని క్రికెట్ దక్షిణాఫ్రికా తెలిపింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మేనేజర్లు మ్యాచ్‌ రిఫరీ జెఫ్‌ క్రోతో చర్చించారు. ఇక ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ఫీల్డ్‌ అంపైర్లు, రిఫరీ మాత్రమే.

డారెన్ లీమన్, ఆస్ట్రేలియా జట్టు కోచ్

డారెన్ లీమన్, ఆస్ట్రేలియా జట్టు కోచ్

ఈ ఘటనలో డేవిడ్ వార్నర్‌కు మద్దతుగా నిలిచాడు కోచ్ డారెన్ లీమన్. లీమన్ మాట్లాడుతూ 'మేము కచ్చితంగా వార్నర్‌కు మద్దతు తెలుపుతాం. మ్యాచ్‌లో విజయం సాధించడానికి ప్రత్యేకమైన మార్గంలో ఆడాలని కోరుకుంటాం. మా దృష్టిలో మేము మా పరిధిని దాటలేదు. అదే ముఖ్యమైన అంశం. ఈ ఘటనపై ఎవరి అభిప్రాయం వారికుంది. మున్ముందు రెండు జట్లు ఎలా ఆడుతాయో, ఏం జరుగుతుందో వేచి చుద్దాం. మా లక్ష్యం సఫారీ గడ్డపై సిరీస్‌ను గెలవడమే. ఐదు రోజుల ఆటను చూశాం. ఇక్కడ సిరీస్‌ను గెలవడం చాలా కష్టమైంది' అని లీమన్ పేర్కొన్నాడు.

షేన్ వార్న్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

ఈ గొడవపై షేన్‌ వార్న్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. 'ఆటగాళ్ల మధ్య ఎగతాళిలు, చీదరింపులు, స్లెడ్జింగ్‌లు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భాగమే. ఇరు జట్లు ఆటగాళ్లు ఇంతటితో వదిలేయండి. ఒకరికొకరు మర్యాదగా నడుచుకోవడం మంచిది. ఎవరైనా వ్యక్తిగత విషయాలు ప్రస్తావించొద్దు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడం మానేసి బీరు తాగుతూ కలిసిపోండి' అని వార్న్‌ ట్వీట్‌ చేశాడు.

గ్రేమ్ స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్

దక్షిణాఫ్రికా ఆటగాళ్ల పట్ల వార్నర్‌ ఎన్నోసార్లు తన హద్దులు దాటి ప్రవర్తించాడని, అందుకే అతని రియాక్షన్‌ పట్ల మేం ఆశ్చర్య పడలేదని, ఒకరిపై కామెంట్‌ చేసేముందు తీసుకోవడానికి కూడా సిద్దంగా ఉండాలని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

జరిగిందంతా మంచిది కాదని గిల్ క్రిస్ట్ పేర్కొన్నాడు. ఆటగాళ్లు వ్యక్తిగతంగా దూషించుకోవడం అంత మంచిది కాదని ఆసీస్ మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్‌ సైతం ట్వీట్‌ చేశాడు.

మైకేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

డేవిడ్‌ వార్నర్‌ అంటే స్లెడ్జింగ్‌కు పెట్టింది పేరని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ అన్నారు. దక్షిణాఫ్రికా మేనేజర్‌ మహ్మద్‌ ముసాజీ సైతం వార్నర్‌నే తప్పుపట్టాడు.

వార్నర్‌కు వార్నింగ్ ఇచ్చిన డాలీన్ డీకాక్

క్వింటన్ డీకాక్ సోదరి ట్విట్టర్ వేదికగా ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు వార్నింగ్ ఇచ్చింది. డీకాక్ సోదరి డాలీన్ డీకాక్ తన ట్విట్టర్‌లో "వాట్ ద ఫక్. వార్నర్ నేను నిన్ను హర్ట్ చేస్తా" అని ట్వీట్ చేసింది.

Story first published: Tuesday, March 6, 2018, 18:15 [IST]
Other articles published on Mar 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X