Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో టిక్‌టాక్‌.. ఈసారి బాహుబలి అవతారమెత్తిన వార్నర్‌ (వీడియో)!!

David Warner pulls off Prabhass famous Bahubali dialogue in latest TikTok video with Sunrisers Hyderabad

సిడ్నీ: కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పుతో లాక్‌డౌన్‌ అమలు చేయడంతో అంతర్జాతీయ క్రికెట్‌ జరగడం లేదు. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 వాయిదా పడింది. దీంతో క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులతో సరదా సమయం గడుపుతున్నారు. అయితే సోషల్‌ మీడియా వేదికగా మాత్రం అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌. వరుస టిక్‌టాక్‌ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు.

తెలుగు చిత్రాలకు ఫిదా:

తెలుగు చిత్రాలకు ఫిదా:

డేవిడ్‌ వార్నర్‌ తెలుగు చిత్రాలకు ఫిదా అయినట్టున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన టాలీవుడ్‌ సినిమా పాటలు, డైలాగ్స్‌కు టిక్‌టాక్‌ చేసి అలరిస్తున్నాడు. ఆయన సతీమణి క్యాండిస్‌, కుమార్తె ఇవీ కూడా టిక్‌టాక్ వీడియోలలో కనిపించడం విశేషం. ఇప్పటికే అల వైకుంఠపురం సినిమాలోని 'బుట్టబొమ్మ', 'రాములో రాములా' పాటలకు వార్నర్‌ డ్యాన్స్‌ చేశాడు. ఆపై టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ పోకిరి సినిమాలో మహేశ్‌బాబు డైలాగ్‌ 'ఒక్కసారి కమిట్ అయితే నామాట నేనే వినను' అని చెప్పి ఆకట్టుకున్నారు. తాజాగా మరో టిక్‌టాక్‌తో వార్నర్ అలరించాడు.

బాహుబలి అవతారం ఎత్తిన వార్నర్‌:

డేవిడ్ వార్నర్ తాజాగా అమరేంద్ర బాహుబలి అవతారం ఎత్తారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన 'బాహుబలి' సినిమాలోని డైలాగ్‌ చెప్పాడు. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ చెప్పిన 'అమరేంద్ర బాహుబలి అనే నేను' డైలాగ్‌ను టిక్‌టాక్‌ చేసి అందిరినీ సంభ్రమాశ్చర్యంలోకి ముంచెత్తాడు. సైనికుడి గెటప్‌లో వార్నర్ ఉండగా.. కూతురు ఓ అభిమానిలా అలరించింది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. 'ఈ సినిమా పేరు చెప్పండి చూద్దాం' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఇది వైరల్‌ అవుతోంది.

'మైండ్ బ్లాక్' చేయాలంటూ డిమాండ్:

'మైండ్ బ్లాక్' చేయాలంటూ డిమాండ్:

టాలీవుడ్‌ అభిమానుల నుంచి డేవిడ్ వార్నర్‌కు పలు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. తమ అభిమాన హీరోలకు సంబంధించిన పాటలకు, డైలాగ్‌లకు టిక్‌టాక్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. చాలామంది మహేశ్‌బాబు రీసెంట్ సూపర్ హిట్ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని 'మైండ్‌ బ్లాక్‌' అనే పాటకు వార్నర్ టిక్‌-టాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి వార్నర్ కూడా రెస్పాండ్ అయ్యాడు. 'అదే ప్రయత్నంలో ఉన్నాను' అంటూ అతను ట్వీట్ చేశాడు.

ఆటోలో చక్కర్లు:

ఆటోలో చక్కర్లు:

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తెలుగు ఫ్రాంచైజీ 'సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌'కు వార్నర్‌ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా అతడికి హైదరాబాద్‌తో అనుబంధం ఏర్పడింది. ఇక్కడి సంస్కృతి, ఆహారం, ప్రదేశాలు ఆయనకు ఎంతో ఇష్టం. ఐపీఎల్ సమయంలో హైదరాబాద్ మొత్తం కుటుంబంతో కలిసి తిరుగుతాడు. గతేడాది లీగ్ జరుగుతుండగా.. ఆటోలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

Story first published: Saturday, May 16, 2020, 19:15 [IST]
Other articles published on May 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+