For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతనే నా వారసుడు..!- డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 స్టేజ్‌లో ఆస్ట్రేలియా నిష్క్రమించడంతో వార్నర్ మౌనంగా ఆటకు వీడ్కోలు పలికాడు. ట్రోఫీని గెలిచి ఘనంగా కెరీర్‌ను ముగించాలనుకున్న వార్నర్ ఆశలపై భారత్-అఫ్గానిస్థాన్ నీళ్లు చెల్లింది. ప్రపంచకప్ ప్రారంభం కాకముందే వార్నర్ తన రిటైర్మెంట్ గురించి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మెగాటోర్నీ ముగిసిన అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తానని ముందే తెలిపాడు.

వన్డే ప్రపంచకప్ 2023 విజయానంతరం వార్నర్ వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో సిడ్నీ టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 37 ఏళ్ల వార్నర్ సుమారు 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. వార్నర్ 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 8786, వన్డేల్లో 6932 పరుగులు, పొట్టి ఫార్మాట్‌లో 3277 రన్స్ సాధించాడు.

David Warner Passes the Torch to Jake Fraser-McGurk All Yours Now Champion

డేవిడ్ వార్నర్ మూడు ఫార్మాట్లలో డాషింగ్ ఓపెనర్‌గా సత్తాచాటాడు. క్రికెట్ ప్రపంచంలో అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా అదరగొట్టిన ప్లేయర్లు చాలా అరుదు. వాళ్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా వార్నర్ చరిత్రకెక్కాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు వార్నర్ గుడ్‌బై చెప్పడంతో ఆస్ట్రేలియాకు అసలైన సవాల్ మొదలైంది. వార్నర్ స్థానాన్ని భర్తీ చేస్తూ అదే జోరుతో, నిలకడగా పరుగులు సాధించే ఓపెనర్‌ను వెతకడంలో ఆసీస్ బిజీబిజీ అయ్యింది.

టెస్టుల్లో వార్నర్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన స్టీవ్ స్మిత్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అయితే ఓపెనర్‌గా తన వారసుడు ఎవరో వార్నరే ప్రకటించాడు. 22 ఏళ్ల జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ తన స్థానాన్ని భర్తీ చేయగలడని తెలిపాడు. ఆస్ట్రేలియా తరఫున ఫ్రేజర్ రెండు వన్డేలే ఆడాడు. అయితే ఐపీఎల్‌లో ఢీల్లీ క్యాపిటల్స్ తరఫున ఫ్రేజర్ సంచలన ప్రదర్శన చేశాడు. విధ్వంసకర ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తొమ్మిది మ్యాచ్‌ల్లో ఫ్రేజర్ 234 స్ట్రైక్‌రేటుతో 330 పరుగులు చేశాడు. ఢిల్లీ జట్టులోనే ఉన్న వార్నర్.. ఫ్రేజర్ నైపుణ్యాలను దగ్గర నుంచి పరిశీలించాడు. యువ హిట్టర్ ప్రతిభకు ఫిదా అయిన వార్నర్ ఆస్ట్రేలియా భవిష్యత్ ఓపెనర్‌గా ఫ్రేజరే సరైనోడని భావించాడు. 'ఛాంపియన్.. ఇకపై అంతా నీదే' అంటూ ఫ్రేజర్ ఫొటోను వార్నర్ పోస్ట్ చేశాడు.

Story first published: Wednesday, June 26, 2024, 18:18 [IST]
Other articles published on Jun 26, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+