Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా భార్యను "ఫక్.. సుక్" అని తిట్టినందుకే..: డేవిడ్ వార్నర్

David Warner Opens Up On Quinton de Kock

హైదరాబాద్: డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్‌తో జరిగిన గొడవపై ఎట్టకేలకు ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఎట్టకేలకు నొరువిప్పాడు. గురువారం ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో వార్నర్ మాట్లాడుతూ తన భార్యపై అసభ్య పదజాలాన్ని వాడినందుకే తాను డికాక్‌తో గొడవపడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో నాలుగో రోజైన ఆదివారం ఆటలో భాగంగా స్లెడ్జింగ్ చేసిన వార్నర్.. డికాక్ కుటుంబాన్ని బుష్ పిగ్ అని హేళన చేశాడు. ఆ తర్వాత టీ విరామ సమయంలో మెట్ల వద్ద తీవ్ర వాగ్వాదానికి దిగారు. సహచర ఆటగాళ్లు వద్దు వద్దు అని వారిస్తున్నా వార్నర్ దూకుడు ప్రదర్శించాడు.

దీనికి డికాక్‌ కూడా దీటుగానే సమాధానం ఇచ్చాడు. అయితే, సహచరులు టిమ్‌ పైన్‌, ఖవాజా, ఓ అధికారి వారిస్తున్నా వినకుండా వార్నర్‌.. క్వింటన్‌ను కొట్టేందుకు దూసుకెళ్లాడు. ఈ గొడవ ఎక్కువవడంతో సఫారీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న ఆ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ బయటకు వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికి కెప్టెన్‌ స్మిత్‌ వచ్చి వార్నర్‌ను డ్రస్సింగ్ రూమ్‌లోకి తీసుకువెళ్లిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం కింగ్స్ మీడ్ స్టేడియంలో మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయిన సంగతి తెలిసిందే. అయితే అంతకముందే డ్రెస్సింగ్ రూమ్‌కు వస్తున్న క్రమంలో వార్నర్-డికాక్ మధ్య మైదానంలోనే తీవ్రస్థాయిలో వాదనలు జరిగినట్లు మరో పుటేజ్‌లో తాజాగా బయటపడింది.

నా భార్యను ఉద్దేశిస్తూ డీకాక్ "ఫక్.. సుక్" అంటూ వ్యాఖ్యానించడంతో తాను నిగ్రహం కోల్పోయినట్లు వార్నర్ చెప్పుకొచ్చాడు. 'ముందు రోజు నేను కాస్త ఆవేశానికి లోనయ్యానని పుటేజ్‌లో చూసి తెలుసుకున్నా. దానికి చాలా పశ్చాత్తపం చెందా. కానీ తర్వాత డికాక్ నా కుటుంబం జోలికి వచ్చాడు. నా భార్య గురించి తప్పుగా మాట్లాడటంతో నేను అదుపు తప్పాను. ఆడవాళ్లు, జాతి వివక్షపై వ్యాఖ్యలు చేయకూడదు. ఆ జోన్‌ను ఎవరూ టచ్ చేయకూడదు' అని వార్నర్ చెప్పాడు.

కాగా, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు పోర్ట్ ఎలిజబెత్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వివాదంపై విచారణకు ఆదేశించిన ఐసీసీ ఈ గొవడలో వార్నర్‌దే ఎక్కువ తప్పు ఉందని అతడికి మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించడంతో పాటు, మూడు డీమెరిట్ పాయింట్లను జత చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ వివాదంలో ప్రమేయం ఉన్న మరో ఆటగాడు క్వింటన్ డీకాక్‌పై కూడా చర్యలు తీసుకుంది. డికాక్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా వేయడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను అతడి ఖాతాలో జత చేసింది. తొలి టెస్టులో వార్నర్ లెవల్ 2 అతిక్రమణకు పాల్పడగా, డీకాక్ లెవెల్ 1 అతిక్రమణకు పాల్పడినట్లు అంఫైర్లు స్పష్టం చేశారు. ఆటగాళ్ల మధ్య గొడవలు క్రికెట్‌కు మంచివి కాదని ఇప్పటికే ఇరు జట్లకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు హితవు పలికారు.

Story first published: Friday, March 9, 2018, 12:54 [IST]
Other articles published on Mar 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+