కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్‌కి ముగ్ధుడైన వార్నర్: ప్రశంసల వెల్లువ

హైదరాబాద్: కేప్‌టౌన్ వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేప్‌టౌన్‌లో విరాట్ కోహ్లీ (160 నాటౌట్) ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీ ఇన్నింగ్స్‌కి విదేశీ క్రికెటర్లు సైతం ముగ్ధులయ్యారు.
'ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ మరో స్థాయికి చేరుకున్నాడు. వాట్ ఎ ప్లేయర్' అంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ట్విట్టర్ వేదికగా కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్‌కు చెందిన పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ తన కెరీర్‌లో 34వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన భారత కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. కోహ్లీకి కెప్టెన్‌గా ఇది 12వ సెంచరీ. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (11) సెంచరీల రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు.
తాజా విజయంతో ఆరు వన్డేల సిరిస్‌లో కోహ్లీసేన 3-0తో ఆధిక్యంలో ఉంది. భారత్ నిర్దేశించిన 304 పరుగుల భారీ లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 179 పరుగులకు కుప్పకూలింది. భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్(4/46), కుల్దీప్ యాదవ్(4/23) సఫారీ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు.
దీంతో సఫారీ గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌లో వరుసగా మూడో విజయం అందించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అంతేకాదు రెండున్నర దశాబ్దాల కల సాకారమయ్యే దిశగా ముందడుగు పడింది. దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును కోహ్లీసేన ఒడిసిపట్టుకుంది.
డేవిడ్ వార్నర్
ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ మరో స్థాయికి చేరుకున్నాడు. వాట్ ఎ ప్లేయర్
సచిన్ టెండూల్కర్
మైదానంలో అడుగుపెట్టిన తర్వాత సెంచరీలు సాధించడం కోహ్లీకి అలవాలుగా మారింది. వన్డేల్లో 34వ సెంచరీ సాధించిన నీకు అభినందనలు. ఇలాగే పరుగుల వరద పారించు
మైకెల్ వాన్
విరాట్ కోహ్లీ నుంచి మరో సెంచరీ. పరుగుల దాహం, ఆ నిలకడ ప్రదర్శన అద్భుతం. వన్డేల్లో అద్భుతమైన ప్లేయర్
సురేశ్ రైనా
భారత పరుగుల యంత్రం మరో సెంచరీ సాధించింది. వాట్ ఎ ప్లేయర్. కోహ్లీ ఇదే ఫామ్‌తో కొనసాగు
మహమ్మద్ కైఫ్
విరాట్ కోహ్లీ నిలకడ గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. అతని బ్యాటింగ్ చూస్తూ చాలా ఎంజాయ్ చేశాను. ఈ 34వ సెంచరీ అతనికి ఎప్పటికీ ప్రత్యేకం.
వీవీఎస్ లక్ష్మణ్
కోహ్లీ చాలా బాగా ఆడావు. నువ్వు సాధించిన సెంచరీల్లో ఇది ఎంతో ప్రత్యేకం. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా ఆడావు
కరుణ్ నాయర్
నీ ప్రతి ఇన్నింగ్స్ ఎంతో స్ఫూర్తిదాయం. ఈ ఇన్నింగ్స్ అద్భుతం. ఎప్పుడూ ముందుండి నడిపిస్తావు
యూసుఫ్ పఠాన్
మోడ్రన్ డే మాస్టర్ నుంచి మరో మాస్టర్ క్లాస్ సెంచరీ జాలు వారింది. నీ బ్యాటింగ్ ప్రదర్శనతో నన్ను ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నావు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications