For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUS vs WI: చరిత్ర స‌ృష్టించిన వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఈ ఘనత అందుకున్నాడు. అయితే ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన మూడో ప్లేయర్ వార్నర్.

అంతకుముందు అన్ని ఫార్మాట్లలో వేర్వేరుగా 100 మ్యాచ్‌లు ఆడిన రికార్డు ఇద్దరు పేరిట మాత్రమే ఉండేది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ బ్యాటర్ రాస్ టేలర్ ఈ ఘనత సాధించారు. భారత్ తరఫున కోహ్లి 113 టెస్టులు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు. కివీస్‌కు ప్రాతినిథ్యం వహించిన టేలర్ 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడాడు.

David Warner makes history in Australia vs West Indies 1st T20I

అయితే ఈ స్పెషల్ టీ20లో డేవిడ్ వార్నర్ విధ్వంసం సృష్టించాడు. 36 బంతుల్లో 70 పరుగులు సాధించాడు. 12 ఫోర్లు, ఒక సిక్సర్ బాది ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 213 చేసింది. వార్నర్, జోస్ ఇంగ్లిస్ (39; 25 బంతుల్లో) తొలి వికెట్‌కు 8 ఓవర్లలోనే 93 పరుగులు జోడించారు. వార్నర్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు.

ఈ క్రమంలో వార్నర్ మరో ఘనత సాధించాడు. 100వ మ్యాచ్‌లో అన్ని ఫార్మాట్లలో 50+ స్కోరు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. అయితే వార్నర్ ఔటైన తర్వాత ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కానీ ఆఖర్లో టిమ్ డేవిడ్ (37*; 17 బంతుల్లో), వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ (21; 14 బంతుల్లో) విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. వెస్టిండీస్ బౌలర్లు రసెల్ మూడు వికెట్లు, అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో వార్నర్ వన్డే, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్ మాత్రమే వార్నర్ ఆడుతున్నాడు.

Story first published: Friday, February 9, 2024, 16:49 [IST]
Other articles published on Feb 9, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+