మహేశ్ బాబు పంచ్‌డైలాగ్ అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. వీడియో చూస్తే షాక్!!

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ వరుస టిక్‌టాక్‌లతో దుమ్మలేపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వార్నర్ తెలుగు సినిమాల పాటలు, డైలాగులకు ఫిదా అవుతున్నాడు. ఇటీవలే అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్టబొమ్మ' పాటకు తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. 'అదరగొట్టావ్' అంటూ వార్నర్‌ను తెలుగు ప్రేక్షకులు మెచ్చుకున్నారు.

అదరగొట్టిన వార్నర్:
తాజాగా మరోసారి తెలుగు సినిమా డైలాగ్‌తో డేవిడ్ వార్నర్ తన అభిమానులను, నెటిజన్లను అలరించాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'పోకిరి'లోని 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అనే డైలాగ్ టిక్‌టాక్ వీడియో చేసి అభిమానులతో పంచుకున్నాడు. 'ఈ సినిమా పేరేంటో తెలుసా? మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి' అని ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు.

వార్నర్‌ను మెచ్చుకున్న పూరి:
ఈ వీడియో చూసిన పోకిరి సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్.. డేవిడ్ వార్నర్‌ను మెచ్చుకున్నాడు. 'డేవిడ్ వార్నర్ ఇది నువ్వేనా!!. ఈ డైలాగ్ నీ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయింది. నువ్వు నటుడిగా కూడా రాణించగలవు. భవిష్యత్‌లో కుదిరితే నా సినిమాలో అతిథి పాత్ర ఇస్తా. లవ్యూ' అని ట్వీట్ చేశారు .‘పోకిరి'లోని డైలాగ్‌ను వార్నర్ చాలా బాగా చెప్పాడు. వీడియో చూస్తే వార్నర్ నువ్ కేక అని కూడా అంటారు.

మా జట్టు డెత్ బౌలింగే బెస్ట్:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తన జట్టు డెత్ బౌలింగ్ ఉత్తమమైనదని సన్‌రైజర్స్ హైదర్‌బాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్, ఆఫ్ఘన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో కూడిన తమ జట్టు డెత్ బౌలింగ్ ఐపీఎల్లో అత్యుత్తమైనదని పేర్కొన్నాడు. 'మనకు మంచి జట్టు ఉంది. ఎక్కువ మంది బౌలర్లు ఉండడం మంచి విషయం. తొలి ఓవర్లలో మంచి స్వింగ్ బౌలింగ్ ఉంది. మన డెత్ బౌలింగ్ ఐపీఎల్‌లోనే అత్యుత్తమైనది' అని వార్నర్ అన్నాడు.
వైద్య సిబ్బందికి మద్దతుగా గుండు
క్షణం తీరికలేకుండా ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వైద్య, పోలీస్ సిబ్బందికి సంఘీభావంగా డేవిడ్ వార్నర్ ఇటీవలే గుండు చేసుకున్నాడు. ఇంట్లోని ట్రిమ్మర్ సాయంతో వార్నర్ తన జుట్టును కత్తిరించుకున్నాడు. కరోనాను సమర్థంగా నిలువరించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారికి ఇది నా మద్దతు అని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వీడియోను పోస్ట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications