For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డేవిడ్ భాయ్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్‌లో అమ్ముడుపోలేదు కానీ..!

David Warner: ఐపీఎల్ 2025 మెగా వేలంలో స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అమ్ముడుపోలేదు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ కు మారి కరాచీ కింగ్స్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో కరాచీ కింగ్స్ జట్టు బాగా ఆడుతోంది. ఇప్పుడు తాజాగా అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్(MLC)లో ఆడనున్నాడు. వార్నర్ మేజర్ లీగ్ క్రికెట్ మూడో సీజన్ లో సియాటిల్ ఓర్కాస్ జట్టు తరపున ఆడనున్నాడు. ఈ విషయాన్ని సియాటిల్ ఓర్కాస్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియా సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ తమ ఫ్రాంచైజీలో ఆడనున్నట్లు తెలిపింది. మేజర్ క్రికెట్ లీగ్ జూన్ 12 నుంచి జులై 13 వరకు నిర్వహించనున్నారు.

టీ20 క్రికెట్ లో 12 వేల కంటే ఎక్కువ పరుగులు
డేవిడ్ వార్నర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు 401 టీ20 మ్యాచ్‌లు ఆడి 140.,27 స్ట్రైక్ రేట్ తో 12,956 పరుగులు చేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అప్పటి నుంచి డేవిడ్ వార్నర్ వివిధ దేశాల లీగ్ లలో ఆడుతున్నాడు. చాలా అనుభవం కలిగి ఉన్నాడు.

David Warner Joins Seattle Orcas in Major League Cricket 2025 After Going Unsold in IPL Mega Auction

మొదటి సీజన్ లో ఫైనల్స్ ఆడిన సియాటిల్ ఓర్కాస్
మేజర్ లీగ్ క్రికెట్ మొదటి సీజన్ లో సియాటిల్ ఓర్కాస్ జట్టు అద్భుతంగా రాణించింది. ఆ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచి ఫైనల్స్ కు చేరుకుంది. కానీ ఆ జట్టు ఫైనల్ మ్యాచ్ లో ఎంఐ న్యూయార్క్ జట్టు చేతిలో ఓడిపోయారు. రెండో సీజన్ లో ఆ జట్టు బాగా ఆడలేదు. 7 మ్యాచ్‌లలో ఒక మ్యాచ్ మాత్రమే గెలవగలిగింది. ఈ కారణంగా జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇప్పుడు మేజర్ లీగ్ క్రికెట్ 2025కి ముందు సియాటిల్ ఓర్కాస్ జట్టులో డేవిడ్ వార్నర్ చేరడం వారికి బలంగా మారవచ్చు.

బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ కు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్
బిగ్ బాష్ లీగ్ లో డేవిడ్ వార్నర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.డేవిడ్ వార్నర్ సిడ్నీ థండర్ జట్టుకు నాయకత్వం వహించి జట్టును ఫైనల్స్ కు నడిపించాడు. దీనితో పాటు డేవిడ్ వార్నర్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఛాంపియన్ జట్టు దుబాయ్ క్యాపిటల్స్‌లో కూడా భాగమయ్యాడు.

ఐపీఎల్ లో అమ్ముడుపోలేదు.
ఐపీఎల్ 2026లో కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు టైటిల్ అందించాడు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 8 మ్యాచ్ లు ఆడి కేవలం 168 పరుగులే చేశాడు. ఈ క్రమంలో మెగా వేలం 2025కి ముందు ఢిల్లీ డేవిడ్ వార్నర్ ను వదిలేయగా.. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ వైపు డేవిడ్ వార్నర్ దృష్టి సారించాడు. పీఎస్ఎల్ టీ20 లీగ్ లో అధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు. కరాచీ కింగ్స్ వార్నర్ ను 2.57 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్ గా నియమించింది. పీఎస్ఎల్ ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు జరగనుంది.

Story first published: Saturday, April 19, 2025, 16:38 [IST]
Other articles published on Apr 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+