Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australi T20 Series : డేవిడ్ వార్నర్ మిస్.. టీ20 సిరీస్ కోసం భారత పర్యటనకు రానున్న ఆసీస్ టీం ఇదే..!

 David Warner is not in the Squad of Australia for T20 Series Against India

సెప్టెంబర్ 20 నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా టీంను ఆ దేశ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌‌ను ఆ దేశ సెలెక్షన్ కమిటీ పక్కన పెట్టింది. టీ20 ప్రపంచ కప్‌ ముందు ఆసీస్, భారత్‌కు కీలక సన్నాహక టీ20 సిరీస్‌గా ఈ సిరీస్ ఉపయోగపడనుంది. ఇకపోతే టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టుకు కీలకం కానున్న డేవిడ్ వార్నర్‌‌కు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే సెలెక్షన్ కమిటీ అతన్ని ఈ సిరీస్‌కు తీసుకోలేదు. ఇకపోతే వార్నర్ స్థానంలో భారత పర్యటనకు కెమెరూన్ గ్రీన్ ఎంపికయ్యాడు.

మొహాలీలో సెప్టెంబర్ 20న మొదటి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 23న రెండో టీ20 నాగ్ పూర్ వేదికగా.. సెప్టెంబర్ 25న మూడో టీ20 మ్యాచ్‌ మన హైదరాబాద్‌‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. ఇక ఆస్ట్రేలియా సెలక్షన్ ప్యానెల్ ఛీప్ జార్జ్ బెయిలీ ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ..'అన్ని కోణాల్లో గ్రీన్ కామెరాన్ ఇటీవల చాలా మెరుగయ్యాడు. అతన్ని టీ20 ఫార్మాట్‌కు మరింత ఎక్స్ పోజ్ చేయడం వల్ల అతని ఆల్‌రౌండ్ నైపుణ్యం ఉపయోగించుకునే వీలుంటుంది. అతని సెలెక్షన్ పట్ల మేం సంతోషిస్తున్నాం' అని బెయిలీ పేర్కొన్నాడు.



వార్నర్ ఇటీవల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో 57, 13పరుగులు చేశాడు. ఈ నెల ప్రారంభంలో.. వార్నర్ సిడ్నీ థండర్‌తో రెండేళ్ల ఒప్పందంపై సంతకం చేశాడు. బిగ్ బాష్ లీగ్ (BBL)కు తొమ్మిదేళ్లుగా దూరమైన వార్నర్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సంప్రదింపులతో మళ్లీ బీబీఎల్‌కు ఆడబోతున్నాడు. ఇకపోతే జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిడ్నీ టెస్ట్‌ అనంతరం వార్నర్ థండర్‌ టీంలో చేరనున్నాడు. అతను బీబీఎల్‌లో ఐదు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు:
అష్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), టిమ్ డేవిడ్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, కామెరాన్ గ్రీన్, ఆడమ్ జాంపా .

Story first published: Thursday, September 1, 2022, 9:40 [IST]
Other articles published on Sep 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+