ఆమెతో జత కట్టొచ్చుకదా కోహ్లీ.. అనుష్క హెల్ప్ చేస్తుందిలే: వార్నర్

సిడ్నీ: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మైదానంలోకి దిగితే.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడం అలవాటు. లాక్‌డౌన్‌లో బ్యాటు పట్టే అవకాశం లేకపోవడంతో మొబైల్ పట్టాడు. ఇక సోషల్ మీడియాలో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. కుటుంబ సమేతంగా వీడియోలు చేయడం, అభిమానులను అలరించడమే పనిగా పెట్టుకున్నాడు. వార్నర్ వినోదాన్ని పంచినట్లు మరే క్రికెటర్ పంచలేదంటే అతిశయోక్తి కాదేమో. ఒకవైపు లాక్‌డౌన్ సమయాన్ని ఆస్వాదిస్తూనే మరొకవైపు అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాడు.
బాలా పాటకు ఇరగదీసిన వార్నర్:
టిక్‌టాక్‌లో డేవిడ్ వార్నర్ చేసిన వీడియోలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. భాష రాకున్నా.. లిప్ సింక్‌తో అన్నింట్లోనూ అదరగొడుతున్నాడు. ముఖ్యంగా తెలుగు, హిందీ సినిమా పాటలకు డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా వార్నర్ చేసిన మరో టిక్‌టాక్ వీడియో అభిమానుల్ని తెగ అలరిస్తోంది. 2019లో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన హౌస్‌ఫుల్-4 చిత్రంలోని 'బాలా' పాటకు వార్నర్ ఇరగదీశాడు. అయితే గతంలో పోస్ట్ చేసిన వీడియోలకు భిన్నంగా ఈ వీడియోలో కనిపించాడు. ఐదు ఫ్రేమ్‌ల్లో కనిపించిన వార్నర్.. ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు.

అనుష్క హెల్ప్ చేస్తుందిలే:
డేవిడ్ వార్నర్ బాలా పాట వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. వీడియోని చూసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నవ్వుతున్న ఎమోజీలను కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన వార్నర్.. 'కోహ్లీ నువ్వు కూడా టిక్‌టాక్‌లో నీ భార్యతో కలిసి జత కట్టొచ్చుకదా. నీకు టిక్‌టాక్ అకౌంట్‌ను అనుష్క శర్మ క్రియేట్ చేస్తుందిలే' అని నవ్వుతున్న ఎమోజీలను జోడించాడు. వార్నర్ టిక్‌టాక్ వీడియోకి అక్షయ్ కుమార్ కూడా స్పందిచాడు.

బుట్ట బొమ్మతో మొదలు:
డేవిడ్ వార్నర్ నెల రోజుల క్రితమే టిక్‌టాక్‌లోకి వచ్చాడు. అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంటపురంలో' సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్‌కి తన భార్య క్యాండీస్‌తో కలిసి వార్నర్ టిక్‌టాక్ వీడియో చేశాడు. ఆ వీడియోకి పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో.. అదే సినిమాలోని 'రాములో రాములా' పాటకి కూడా వార్నర్ దంపతులు కాలు కదిపారు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. మధ్యలో పోకిరి, బాహుబలి సినిమాలోని ఫేమస్ డైలాగ్‌లతో వార్నర్ టిక్‌టాక్ వీడియోలు చేశాడు. ఒక తమిళ పాట బీటుకూ వార్నర్ టిక్‌టాక్ చేశాడు. ఇక ఎన్‌టీఆర్ పుట్టినరోజున ఊహించని బహుమతి ఇచ్చాడు డేవిడ్ వార్నర్. భార్య క్యాండిస్‌తో కలిసి జనతా గ్యారేజ్‌లోని 'పక్కా లోకల్' పాటకు స్టెప్పులేశాడు. అవెంజర్స్, ముక్కాబులా టిక్‌టాక్‌లు కూడా చేసాడు.

క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ:
తెలుగు,తమిళ, హిందీ పాటలకు స్టెప్పులేసిన వార్నర్.. మధ్యలో బ్యాట్ పట్టాడు. బ్యాట్‌తో తన ఫేవరెట్ షాట్లైన రివర్స్ స్వీప్, ఆన్ డ్రైవ్, స్విచ్ హిట్, స్లాగ్ షాట్‌లు ఆడి టిక్‌టాక్‌లోకి అప్‌లోడ్ చేశాడు. ఇలా ఆ షాట్లు ఆడమని అభిమానులకు చాలెంజ్ కూడా విసిరాడు. ఆ వీడియోకు ఒక ఆసక్తికరమైన కామెంట్‌ను పోస్ట్ చేశాడు. 'నాకు క్రికెట్ అంటే ఇష్టం కాదు. ఆ గేమ్ అంటే పిచ్చి ప్రేమ' అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications