Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

David Warner: రాబోయే రోజుల్లో.. వార్నర్‌ ఇంట్లో ఉండటం తలచుకుంటే: క్యాండీస్‌

David Warner in quarantine, Wife Candice posted a Throwback Videos on him

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు తన కుటుంబం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఆడుతూ ఎంత బిజీగా ఉన్నా.. కాస్త సమయం దొరికితే చాలు భార్య క్యాండీస్‌తో పాటు ముగ్గురు కుమార్తెలతో సరదాగా గడుపుతాడు. టోర్నీ ఏదైనా వారితో సమయం గడపడానికి ఇష్టపడుతాడు. అంతేకాదు అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకొని సంతోషం వ్యక్తం చేస్తాడు. మరోవైపు వార్నర్‌ సతీమణి క్యాండీస్‌ కూడా తమ విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసి వార్నర్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.

'వీకెండ్‌ ప్లాన్స్‌ ఏంటని అందరూ నన్ను అడుగుతుంటారు. 'సూపర్‌ డాడ్‌' డేవిడ్ వార్నర్‌ ఇంట్లో ఉంటే.. ఆ రోజు ఇలా ఉంటుంది. మాకు వీకెండ్స్‌ అంటే పిల్లల సంతోషమే. అవన్నీ ఇప్పుడు మిస్‌ అవుతున్నాం. కానీ రాబోయే రోజుల్లో వార్నర్‌ ఇంట్లో ఉండటం తలచుకుంటే సంతోషంగా ఉంది' అని క్యాండీస్‌ వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీంతోపాటు గతంలో అతడు ఇంట్లో ఉన్న సమయంలో తమ పిల్లలతో కలిసి సరదాగా గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంది.

క్యాండీస్‌ పోస్ట్ చేసిన వీడియోలో డేవిడ్ వార్నర్‌ చాకోలెట్లు, బిస్కెట్లు తయారు చేస్తూ.. తన ఇద్దరు పెద్ద కుమార్తెలతో ఆడుకుంటూ ఆనందంగా ఉన్నాడు. క్యాండీస్‌ పోస్ట్ చేసిన వీడియో చూసిన డేవిడ్ వార్నర్‌ వెంటనే స్పందించాడు. 'మీ అందర్నీ చూడకుండా ఉండలేకపోతున్నా' అని రిప్లై ఇచ్చాడు. కరోనా కేసుల కారణంగా ఐపీఎల్ 2021 వాయిదా పడటంతో వార్నర్‌ తిరిగి స్వదేశం చేరుకున్నాడు. భారత్‌ నుంచి నేరుగా రాకపోకలు లేకపోవడంతో మాల్దీవులకు వెళ్లి గతవారం స్వదేశానికి చేరుకున్నాడు. ప్రస్తుతం వార్నర్ క్వారంటైన్‌లో ఉన్నాడు.

ఐపీఎల్‌ 14వ సీజన్‌ జరుగుతున్న సమయంలోనే డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. వార్నర్ స్థానంలోకివీస్ కెప్టెన్ కేన్‌ విలియమ్స్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది. అయితే వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఒకడిగా ఉన్న వార్నర్‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఎస్‌ఆర్‌హెచ్‌పై ట్రోల్స్‌, మీమ్స్‌తో రెచ్చిపోయారు. అయితే కరోనా కారణంగా లీగ్‌ రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించడంతో ఈ వివాదం సమసిపోయింది.

Story first published: Saturday, May 22, 2021, 18:53 [IST]
Other articles published on May 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+