‘ఆచార్య’గా డేవిడ్ వార్నర్.. అదిరిపోయిందంటున్న మెగా ఫ్యాన్స్!

హైదరాబాద్: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన ఆటతో ఎలా అలరిస్తాడో.. సోషల్ మీడియాలో కూడా అదేవిధంగా ఎంటర్‌టైన్ చేస్తాడు. లాక్‌డౌన్‌లో ఫ్యామిలీ‌తో టిక్ టాక్ వీడియోలు చేసి ఆకట్టుకున్న వార్నర్.. అనంతరం స్పూఫ్ వీడియోలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్, టాలీవుడ్ హిట్ సినిమాల ట్రైలర్స్‌ను పలు యాప్‌ల సాయంతో మార్ఫింగ్ చేశాడు. హీరోల దేహానికి తన ముఖాన్ని జత చేసి ఆ వీడియోలను అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా ఈ ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ 'ఆచార్య'గా అవతారమెత్తాడు.

ఆచార్యగా ఆసీస్ స్టార్..

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఆచార్య' టీజర్‌ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్‌ను రీఫేస్‌ యాప్‌తో స్పూఫ్ చేసి మెగాస్టార్ డైలాగ్స్‌ను తాను చెప్పినట్లుగా వీడియోను రూపొందించాడు. దీన్ని సోషల్‌ మీడియా వేదికగా ‘త్వరలోనే వస్తుంది.. నటుడు ఎవరో చెప్పండి'అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వీడియో చూసిన మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

వేసవిలో ప్రేక్షకుల ముందు..

వేసవిలో ప్రేక్షకుల ముందు..

ఇక ఆచార్య సినిమా విషయానికొస్తే.. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ `సిద్ధ` అనే కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.

బుట్టు బొమ్మా సాంగ్‌తో..

బుట్టు బొమ్మా సాంగ్‌తో..

ఇక లాక్‌డౌన్‌ సమయంలో ఎన్నో టిక్‌టాక్‌ వీడియోలు చేసిన డేవిడ్ వార్నర్.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. భార్య, పిల్లలతో కలిసి అల్లు అర్జున్‌ హిట్ సాంగ్ ‘బుట్ట బొమ్మ'కు స్టెప్పులేసి సౌతిండియా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే బాహుబలిలో ప్రభాస్‌ డైలాగ్‌ చెప్పి భారత సీనీ ప్రియుల మనసును దోచుకున్నాడు. ఇక బుట్టు బొమ్మ సాంగ్‌కు మైదానంలో కూడా చిందేశాడు.

తన డ్యాన్స్‌తో అల్లు అర్జున్ నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత ఈ స్టార్‌ క్రికెటర్‌ రూటు మార్చి రీఫేస్‌ యాప్‌ను ఉపయోగించి అమితాబ్, బాహుబ‌లిలో ప్ర‌భాస్‌, మ‌హ‌ర్షిలో మహేశ్‌బాబు, ద‌ర్బార్‌లో ర‌జినీకాంత్‌ స‌ల్మాన్‌ఖాన్ సినిమాల్లో కొన్ని స‌న్నివేశాల‌ను రీఫేస్ చేసి ఆ వీడియోల‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అవి ఎంతగానో నెటిజన్లను ఆకట్టుకున్నాయి.

రషీద్ ఖాన్‌కు వార్నింగ్..

రషీద్ ఖాన్‌కు వార్నింగ్..

డేవిడ్ వార్నర్‌ దారిలోనే తన ఐపీఎల్ సహచరుడు, అఫ్గానిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్ కూడా స్పూఫ్ వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. నాలుగు రోజుల క్రితం బాహుబలి స్పూఫ్‌ వీడియోను రషీద్ ఖాన్ అభిమానులతో పంచుకున్నాడు. దాంతో అతని వీడియోపై డేవిడ్ వార్నర్ అన్యాయమంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. తన గుర్తింపు దొంగలించాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఇక శనివారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి డేవిడ్ వార్నర్ కృతజ్ఞతలు తెలిపాడు. భారత కెప్టెన్ విరాభిమాని అయిన తన చిన్న కూతురుకు జెర్సీని పంపించినందుకు థ్యాంక్స్ చెప్పాడు. 'మేం సిరీస్‌ ఓడిపోయామని మాకు తెలుసు.. కానీ ఒక్కసారి ఇక్కడ నవ్వుతున్న చిట్టితల్లిని చూస్తే ఆ బాధనంతా మరిచిపోతాం. విరాట్‌ నీ జెర్సీ నా కూతురుకి పంపినందుకు చాలా థ్యాంక్స్‌. నీ జెర్సీ ధరించి నా చిట్టితల్లి మురిసిపోతుంది' అంటూ ట్వీట్ చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, January 31, 2021, 18:43 [IST]
Other articles published on Jan 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X