బ్యాట్ విరగొట్టి, తల బాదుకున్న వార్నర్! - ఏమైందంటే? (వీడియో వైరల్)
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ వార్నర్ కు మ్యాచ్ ఆడుతుంటే అనుకోని సంఘటన చోటు చేసుకుంది. బ్యాటింగ్ కు దిగిన అతడు బ్యాట్ విరగొట్టి బంతితో తలను బాదుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు దాన్ని తెగ షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏ మ్యాచ్ లో ఈ సంఘటన జరిగిందంటే?
జరిగింది ఇదే
ప్రస్తుతం వార్నర్ బీబీఎల్ 2024-25లో ఆడుతున్నాడు. సిడ్నీ థండర్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా ఈ లీగ్ లో భాగంగా హోబార్ట్ హర్రికేన్స్ తో సిడ్నీ థండర్ కు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోనే బరిలోకి దిగిన వార్నర్ కు బంతి తాకింది. రిలే మెరిడిత్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి ఈ ఘటన చోటు చేసుకుంది.

రిలే మెరిడిత్ ఆఫ్ స్టంప్ లైన్ మీదుగా ఫుల్ డెలివరీ బౌల్ చేశాడు. దాన్ని వార్నర్ మిడ్ ఆన్ దిశగా స్ట్రైట్ గా బాదాడు. అయితే బాల్ తగలగానే బ్యాట్ స్పాట్ లోనే విరిగిపోయింది. అనంతరం బంతి గాల్లోకి ఎగిరి అతడి తలకు తాకింది. అదృష్టవశాత్తు వార్నర్ హెల్మెట్ ధరించడంతో ఆ బంతి హెల్మెట్ కు తగిలింది. దీంతో దెబ్బ తగలలేదు. దీంతో ఈ బాల్ కు వార్నర్ పరుగులేమీ చేయలేదు.
దీనికి సంబంధించిన వీడియోను బీబీఎల్ తన అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ లో పోస్డ్ చేసింది. "డేవిడ వార్నర్ బ్యాట్ విరగొట్టి, తనంత తానే తల మీద కొట్టుకున్నాడు" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీనికి నవ్వుతున్న ఎమోజీని జత చేసింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు తెగ నవ్వుకుంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఇక ఆ తర్వాత ఓవర్ లో రిలే వార్నర్ ఓపెనింగ్ పార్ట్నర్ సామ్ కొన్ స్టాస్ ను కూడా ఔట్ చేశాడు.షార్డ్ డెలివరీ వేశాడు. కొన్ స్టాస్ దాన్ని షాట్ బాదేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి నేరుగా వికెట్ కీపర్ మ్యాథ్యూ వేడ్ చేతికి చిక్కింది.
David Warner's bat broke and he's hit himself in the head with it 🤣#BBL14 pic.twitter.com/6g4lp47CSu
— KFC Big Bash League (@BBL) January 10, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications