Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsDC:బెయిర్‌స్టోని కాదని ఎందుకొచ్చాడు రా అయ్యా..కెప్టెన్సీ నుంచి వార్నర్‌ను తీసేయండి!ఆ షార్ట్ రన్ ఉండుంటే?

David Warner Gets Brutally Trolled By SRH Fans After Losing With DC

చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన త్రిల్లింగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ 'సూపర్' విజయం సాధించింది. మొదటగా హైదరాబాద్‌, ఢిల్లీ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సరిసమానంగా 159 పరుగులే చేయడంతో మ్యాచ్‌లో విజేత ఎవరో తేలలేదు. దీంతో 'సూపర్ ఓవర్' వేసి విజేతను నిర్ణయించారు. ఈ సూపర్ ఓవర్లో హైదరాబాద్‌పై ఢిల్లీ ఉత్కంఠ విజయం సాధించింది. బౌలింగ్‌లో అక్షర్ పటేల్, బ్యాటింగ్‌లో రిషబ్ పంత్ చెలరేగడంతో ఢిల్లీ ఈ సీజన్లో హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తప్పిదం కారణంగానే సూపర్ ఓవర్‌లో ఢిల్లీ గెలిచిందంటూ ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

రాణించిన షా, పంత్‌

రాణించిన షా, పంత్‌

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పృథ్వీ షా (53: 39 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌) బౌండరీల వర్షం కురిపించాడు. ఇన్నింగ్స్‌ తొలి మూడు బంతులను హ్యాట్రిక్‌ ఫోర్లుగా మలిచిన షా.. మరుసటి ఓవర్‌లో మరో రెండు బాదాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఢిల్లీ 51/0తో నిలిచింది. నిదానంగా ఆడిన శిఖర్ ధావన్ (28)ను రషీద్‌ ఖాన్ ఔట్‌ చేయగా.. రిషబ్ పంత్‌ (37: 27 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్‌)తో సమన్వయ లోపం కారణంగా పృథ్వీ రనౌటయ్యాడు. అయినా స్టీవ్ స్మిత్‌ (34: 25 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్‌)తో కలిసి పంత్‌ ఢిల్లీకి పోరాడే స్కోర్ అందించాడు.

విలిమయ్సన్‌ పోరాటం

విలిమయ్సన్‌ పోరాటం

ఛేదనలో ఆరంభం నుంచే జానీ బెయిర్‌స్టో (38; 18 బంతుల్లో 3×4, 4×6) బాదుడు మొదలుపెట్టాడు. డేవిడ్ వార్నర్‌ (6) ఔటైనా.. ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అక్షర్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌ దంచిన జానీ.. అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లోనూ ఓ బంతిని స్టాండ్స్‌లో పడేశాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్‌ కొట్టే క్రమంలో ఔటయ్యాడు. బెయిర్‌స్టో వెనుదిరిగాక సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ మందగించింది. కేన్ విలిమయ్సన్‌ (66 నాటౌట్‌: 51 బంతుల్లో 8X4) వరుసగా రెండు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డు కదిలించాడు. కానీ విరాట్‌ సింగ్‌ (14 బంతుల్లో 4) తడబడడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. కేదార్‌ జాదవ్‌ (9) కూడా ఔట్‌ అయ్యాడు. అయితే సుచిత్‌ (14 నాటౌట్‌; 6 బంతుల్లో 2×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి జట్టును పోటీలో నిలిపాడు. చివరకు సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. దాంతో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి.

3 బంతుల్లో 2 పరుగులు

సూపర్ ఓవర్‌‌లో కేన్ విలియమ్సన్‌తో కలిసి బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ డేవిడ్ వార్నర్.. మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేశాడు. చివరి బంతికి వార్నర్ డబుల్ తీసినా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో క్రీజు లోపల వార్నర్ బ్యాట్ ఉంచలేదని తేల్చిన అంపైర్ షార్ట్ రన్ తప్పిదం కింద ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. దాంతో ఢిల్లీ టార్గెట్ 9 పరుగుల నుంచి 8 పరుగులకి తగ్గింది. సూపర్ ఓవర్‌‌లో రషీద్ ఖాన్ మెరుగ్గా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ తడబడింది. అయితే ఆఖరి బంతికి సింగిల్ తీసి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఒకవేళ షార్ట్ రన్ పరుగు కూడా ఉండుంటే.. మ్యాచ్ మరో సూపర్ ఓవర్‌కి వెళ్లేది. అప్పుడు హైదరాబాద్ గెలిచే అవకాశం ఉండేది.

కేన్ మామను కెప్టెన్ చేయండి

జానీ బెయిర్‌స్టో లాంటి పవర్ హిట్టర్ ఉండగా.. కేన్ విలియమ్సన్‌తో కలిసి డేవిడ్ వార్నర్ సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వెళ్లడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వార్నర్ తప్పిదం కారణంగానే సూపర్ ఓవర్‌లో ఢిల్లీ గెలిచిందంటూ ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 'వార్నర్‌కు వయసయిపోయింది.. రోజురోజుకు అతడి బ్యాటింగ్ దిగజారుతోంది', 'బెయిర్‌స్టోని కాదని ఎందుకొచ్చాడు రా అయ్యా', ' కెప్టెన్సీ నుంచి వార్నర్‌ను తీసేయండి', 'వార్నర్ స్వార్ధపరుడు.. కేన్ మామను కెప్టెన్ చేయండి', 'వార్నర్ చెత్త ప్లేయర్' అంటూ కెమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బ కూడా స్పందించారు. 'ఏందిది వార్నర్ అన్నా. సూపర్ ఓవర్లో నువ్ ఎందుకు వచ్చావ్.. బెయిర్‌స్టో, సుచిత్ ఎక్కడ?' అని నిరాశ వ్యక్తం చేశారు.

Story first published: Monday, April 26, 2021, 8:24 [IST]
Other articles published on Apr 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+