ఫోటోలు: 87 ఏళ్ల బ్రాడ్‌మన్ రికార్డుని సమం చేసిన వార్నర్
హైదరాబాద్: సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు మ్యాచ్ ఓపెనింగ్ సెషన్‌లో 87 ఏళ్ల తర్వాత సెంచరీ నమోదు చేసిన తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్‌గా చరిత్ర సృష్టించాడు.
మూడో టెస్టు తొలిరోజైన మంగళవారం లంచ్ విరామానికి ముందు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ 78 బంతుల్లోనే సెంచరీ చేసిన ఆస్ట్రేలియా మొట్టమొదటి ప్లేయర్‌గా వార్నర్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో వార్నర్‌కి ఇది 18వ టెస్టు సెంచరీ కాగా పాకిస్థాన్‌పై మూడో సెంచరీ కావడం విశేషం.
మూడో టెస్టు లంచ్ విరామానికి ముందే 117 నిమిషాల్లో 17 ఫోర్లతో వార్నర్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరిస్‌లో వార్నర్‌కి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. 1930లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డాన్ బ్రాడ్‌మన్ లంచ్ విరామానికి ముందు 105 పరుగులతో సెంచరీ నమోదు చేశాడు.
ఆ టెస్టులో బ్రాడ్‌మన్ 334 పరుగులతో ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంటే గత నలభై ఏళ్లలో ఈ అరుదైన ఘనతను నెలకొల్పిన తొలి ఆటగాడిగా వార్నర్ చరిత్ర సృష్టించాడు. అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మెహన్‌దాస్ మీనన్
సిడ్నీ టెస్టులో లంచ్ విరామానికి ముందే 117 నిమిషాల్లో 17 ఫోర్లతో వార్నర్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరిస్‌లో వార్నర్‌కి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. దీంతో లంచ్ విరామానికి ముందు సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా వార్నర్ అరుదైన ఘనత తనఖాతాలో వేసుకున్నాడు.
మాధవ్
అద్భుతమైన ఆటగాడు. వార్నర్ 18వ టెస్టు సెంచరీపై ట్విట్టర్‌లో అభిమానులు.
పుష్కర్
2017లో వార్నర్ అద్భుతమైన సెంచరీతో శుభారంభం చేశాడు. వార్నర్ 18వ టెస్టు సెంచరీపై ట్విట్టర్‌లో అభిమానులు.
క్రికెటిక్స్
సిడ్నీ టెస్టులో లంచ్ విరామానికి ముందే 117 నిమిషాల్లో 17 ఫోర్లతో వార్నర్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరిస్‌లో వార్నర్‌కి ఇది రెండో సెంచరీ కావడం విశేషం.
ఆండ్రూ రామ్సే
డేవిడ్ వార్నర్ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడా అతనికే తెలియదు.
క్రికెట్ ఆస్ట్రేలియా
టెస్టుల్లో 18వ సెంచరీని నమోదు చేసిన డేవిడ్ వార్నర్‌కు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రేక్షలు లేచి నిల్చోని అభివాదం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications