

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు డేవిడ్ వార్నర్ హైదరాబాద్ నగరం చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐపీఎల్ కారణంగా వార్నర్ కూతురుతో సరదా సమయం గడపలేకపోతున్నాడు. అయితే ఇంత ఎండలో కూడా.. దొరికిన కొద్ది సమయాన్ని తన కూతురు ఇవీ మేతో కలిసి జాలీగా గడుపుతున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
విషయంలోకి వెళితే.. హైదరాబాద్ జట్టు ఏప్రిల్ 8న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడింది. ఇక ఏప్రిల్ 14న హైదరాబాద్ జట్టు తన తర్వాత మ్యాచ్‌ను ఢిల్లీతో ఆడనుంది. అంటే దాదాపు ఐదారు రోజుల విరామం ఉంది. దీంతో జట్టు ఆటగాళ్లంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వార్నర్ తన కూతురుతో కలిసి.. హైదరాబాద్ నగరంలో ఆటో ఎక్కి చక్కర్లు కొడుతున్నాడు. ఈ వీడియోను హైదరాబాద్ జట్టు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
ఈ సీజన్-12లో డేవిడ్ వార్నర్ ఇప్పటి వరకు 349 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం వార్నర్ దగ్గరే ఉంది. హైదరాబాద్ ఆడిన ఆరు మ్యాచ్‌లలో మూడింట్లో విజయం సాధించింది. ప్రస్తుతం 6 పాయింట్లలో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది.