IPL 2023 : సెంచరీ కరువు తీర్చుకున్న స్టార్ ఓపెనర్.. కోహ్లీ కన్నా ఎక్కువ టైం తీసుకున్నాడుగా..!

అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా నిరూపించుకోవడం అంత ఈజీ కాదు. అదే సమయంలో సత్తా నిరూపించుకున్న తర్వాత అనుకున్న స్థాయిలో రాణించకపోతే ఆటగాడిపై ఉండే ఒత్తిడి కూడా అంత తక్కువేం కాదు. ఈ విషయం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కెరీర్ చూస్తే స్పష్టంగా అర్థ: అవుతుంది. సుమారు మూడేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో అతను సెంచరీ చేయకపోవడంతో అతనిపై ఎన్ని విమర్శలు వచ్చాయో తెలిసిందే. అసలు అతన్ని జట్టులో నుంచే తీసేయాలన్నారు. కానీ ఆసియా కప్‌లో అద్భుతమైన సెంచరీతో అందరి నోళ్లూ మూయించాడీ స్టార్ బ్యాటర్. టీ20 వరల్డ్ కప్‌లో కూడా రాణించాడు.

అప్పుడు కోహ్లీకి జరిగినట్లే..
ఫామ్‌లో లేనప్పుడు కోహ్లీపై ఎలా విమర్శలు వచ్చాయో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు కూడా కొన్నేళ్లుగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అతను కూడా అంతర్జాతీయ సెంచరీ చేసి చాలా కాలమైంది. సరిగ్గా చెప్పాలంటే 1043 రోజులైంది. ఇది 71వ సెంచరీ చేయడానికి కోహ్లీ తీసుకున్న గ్యాప్ కన్నా 21 రోజులు ఎక్కువ కావడం గమనార్హం. దీంతో వార్నర్‌పై కూడా చాలా విమర్శలు వచ్చాయి. దానికతోడు టీ20 వరల్డ్ కప్‌లో కూడా వార్నర్ రాణించలేదు.

వరల్డ్ కప్ తర్వాత..
టీ20 ప్రపంచకప్ తర్వాత వార్నర్ భవితవ్యంపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. అయితే తనకు పరిమిత ఓవర్ల క్రికెట్ అంటే చాలా ఇష్టమని చెప్పిన వార్నర్.. తనను విమర్శించేవాళ్లంతా ఇక నుంచి తన ఆట చూడాలని, తన సత్తా నిరూపించుకుంటానని చెప్పాడు. అన్నట్లుగానే ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో సత్తా చాటుతున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే 86 పరుగులు చేసిన వార్నర్.. రెండో మ్యాచ్‌లో 16 పరుగులకే అవుటయ్యాడు. ఈ రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అయితే మూడో మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టాడు. ఓపెనర్లిద్దరూ రాణించడంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.

1043 రోజుల తర్వాత..
ఇన్ని రోజుల తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీతో చెలరేగాడు వార్నర్. ఆస్ట్రేలియా తరఫున కెరీర్‌లో అద్భుతంగా రాణించన వార్నర్.. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 106 పరుగులతో రాణించాడు. ఇది అతని కెరీర్‌లో 44వ అంతర్జాతీయ సెంచరీ. వన్డేల్లో ఇది 19వ శతకం. అతనితో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు పంచుకున్న ట్రావిస్ హెడ్ (152) కూడా రాణించాడు. వీళ్లిద్దరూ కలిసి 269 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో 250 పైగా పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పడం ఈ జోడీకి ఇది రెండోసారి. దీంతో ఇప్పటి వరకు గంగూలీ, సచిన్ టెండూల్కర్ జోడీ మాత్రమే ఉన్న జాబితాలో వార్నర్, ట్రావిస్ హెడ్ కూడా చేరారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications