For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శుభవార్తతో కొత్త ఏడాది ప్రారంభం: మూడోసారి తండ్రి కాబోతున్న వార్నర్

David Warner ends forgettable 2018 with delighting news, set to welcome third child with wife Candice

హైదరాబాద్: 2018 ఆస్ట్రేలియా మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ జీవితంలో మరిచిపోలేని ఏడాది. బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరం కావడంతో పాటు ఆస్ట్రేలియాకు చెడ్డ పేరు తెచ్చాడన్న అపవాదుని మూటగట్టుకున్నాడు. అయితే, 2019 మాత్రం డేవిడ్ వార్నర్‌కు ఓ తీపికబురుతో ప్రారంభమైంది.

మరో నాలుగు నెలల్లో తన ఏడాది నిషేధాన్ని పూర్తిచేసుకోని అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేయనున్న వార్నర్‌‌ను అంతకు ముందే ఓ శుభవార్త పలకరించింది. తాను మూడోసారి తండ్రికాబోతున్నట్లు తన భార్య కాన్‌డైస్ వార్నర్‌ వెల్లడించింది. ఈ మేరకు కాన్‌డైస్ తన ట్విట్టర్‌లో ట్వీట్‌తో పేర్కొంది.

వార్నర్ కుటుంబంలోకి నాలుగో వ్యక్తి

"ఈ ఏడాదంతా మా వెన్నంటి నిలిచిన ప్రతీ ఒక్కరికి తెలియజేసేది ఏమంటే.. 2019లో మా కుటుంబంలోని నలుగురం కాస్త ఐదుగురు కానున్నాం. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు" అని తాను గర్భవతిననే విషయాన్ని ట్వీట్ ద్వారా కాన్‌డైస్ అభిమానులతో పంచుకుంది.

వార్నర్‌‌కు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు

వార్నర్‌‌కు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు

కాగా, డేవిడ్ వార్నర్‌ ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గతేడాది సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామెరూన్ బాన్ క్రాప్ట్‌లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్, వార్నర్‌లకు ఏడాది, బాన్‌క్రాప్ట్‌కు తొమ్మిది నెలలు నిషేధం విధించింది.

వార్నర్‌ పునరాగమం కోసం చూస్తోన్న ఆసీస్ ఆటగాళ్లు

వార్నర్‌ పునరాగమం కోసం చూస్తోన్న ఆసీస్ ఆటగాళ్లు

మరో నాలుగు నెలల్లో వార్నర్‌పై విధించిన నిషేదం పూర్తికానుంది. వార్నర్‌ పునరాగమం కోసం అటు ఆసీస్‌ ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రెండు రోజుల క్రితం డేవిడ్‌ వార్నర్‌ వల్లే తాను బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డానని గిల్‌క్రిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌, స్టీవ్‌ స్మిత్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై పలువురు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.

స్మిత్, బాన్‌క్రాప్ట్ వ్యాఖ్యలపై కెవిన్‌ రాబర్ట్స్‌

స్మిత్, బాన్‌క్రాప్ట్ వ్యాఖ్యలపై కెవిన్‌ రాబర్ట్స్‌

మరోవైపు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ల వ్యాఖ్యలు డేవిడ్‌ వార్నర్‌ను తిరిగి జట్టులోకి రాకుండా ఆపలేవని క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్‌ రాబర్ట్స్‌ అన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్‌ రాబర్ట్స్‌ మాట్లాడుతూ "ఈ వ్యాఖ్యలు వార్నర్‌ను అడ్డుకుంటాయని అనుకోను. అతడితో కలిసి పనిచేయడంపై దృష్టి సారించాం. ఎంపికకు అర్హత సాధించగానే జట్టు ప్రణాళికలో భాగమవ్వడం గురించి మూడు రోజుల క్రితం అతడితో మాట్లాడా. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ముఖ్యం కాదు" అని అన్నాడు.

Story first published: Tuesday, January 1, 2019, 16:51 [IST]
Other articles published on Jan 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+