Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పుడు నిషేధం.. ఇప్పుడు 'క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు'!!

David Warner, Ellyse Perry Win Top Honours At Australia Cricket Awards

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిష్టాత్మక అలెన్‌ బోర్డర్‌ పతకాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఒకప్పుడు బాల్‌ టాంపరింగ్‌లో ఇరుక్కుని మోసగాడిగా ముద్ర వేయించుకుని ఏడాది పాటు నిషేధానికి కూడా గురైన వార్నర్.. ఇప్పుడు ఆ దేశ క్రికెట్‌ హీరోగా నిలిచాడు. ఇక బెలిండా క్లార్క్‌ పతకాన్ని ఆసీస్‌ మహిళల క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ సాధించింది.

పునరాగమనంలో అదరగొట్టిన భారత్:

పునరాగమనంలో అదరగొట్టిన భారత్:

బాల్‌ టాంపరింగ్‌ నిషేధానంతరం పునరాగమనంలో డేవిడ్ వార్నర్ అదిరే ప్రదర్శన చేసాడు. మొదటగా ఐపీఎల్-12లో హైదరాబాద్ జట్టు తరపున పరుగుల వరద పారించాడు. ఆపై ప్రపంచకప్, యాషెస్ టోర్నీలలో మెరిశాడు. ప్రస్తుతం ఆసీస్ తరఫున మూడు ఫార్మాట్‌లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో సీఏ అతడికి ప్రతిష్టాత్మక అలెన్‌ బోర్డర్‌ పతకాన్ని అందజేసింది. 2016, 2017లోనూ వార్నర్‌ ఈ పతకాన్ని అందుకున్నాడు.

ఒక్క ఓటు తేడాతో:

ఒక్క ఓటు తేడాతో:

టాంపరింగ్‌కు పాల్పడి 12 నెలల నిషేధాన్ని ఎదుర్కొన్న ఆసీస్‌ మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ కూడా ఈ అవార్డు రేసులో నిలిచినా.. వార్నర్‌ ఒక్క ఓటు తేడాతో ఈ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. వార్నర్‌కు 194 ఓట్లు రాగా.. స్మిత్ 193 ఓట్లు దక్కించుకున్నాడు. వార్నర్‌ ఒక్క ఓటు తేడాతో ఓడించి అలెన్‌ బోర్డర్‌ మెడల్‌ను మూడోసారి దక్కించుకున్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ 185 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.

పెర్రీకి బెలిండా క్లార్క్‌ మెడల్‌:

పెర్రీకి బెలిండా క్లార్క్‌ మెడల్‌:

పురుషుల టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును కూడా డేవిడ్ వార్నర్‌ సొంతం చేసుకున్నాడు. పురుషుల వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌, టెస్ట్‌ ప్లేయర్‌గా మార్నస్ లబుషేన్‌ ఎంపికయ్యారు. బెస్ట్‌ ఫిమేల్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిన ఎలీస్‌ పెర్రీకి బెలిండా క్లార్క్‌ మెడల్‌ లభించింది.

తలవంచుకునే పని చేశా:

తలవంచుకునే పని చేశా:

ఈ అవార్డు అందుకుంటూ వార్నర్‌ తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. 'గతంలో నేను అందరూ తలవంచుకునే పని చేశా. నిషేధం తర్వాత తిరిగి క్రికెట్లో రాణించడానికి ఎంతో పట్టుదల, అంకితభావంతో ప్రయత్నించా. ఈ సీజన్‌ మళ్లీ నా ముఖంలో ఆనందాన్ని నింపింది. చాలా సంతోషంగా ఉంది' అని వార్నర్‌ అన్నాడు.

Story first published: Tuesday, February 11, 2020, 11:45 [IST]
Other articles published on Feb 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+