Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ వీడియో.. గాలిలో నడిచిన వార్నర్‌!!

David Warner Defies Gravity In His Latest TikTok Video
#Watch : Anti Gravity Walk By David Warner

సిడ్నీ: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ మైదానంలోకి దిగితే.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడం అలవాటు. లాక్‌డౌన్‌లో బ్యాటు పట్టే అవకాశం లేకపోవడంతో మొబైల్‌ పట్టాడు. ఇక సోషల్‌ మీడియాలో బ్యాటింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. కుటుంబ సమేతంగా వీడియోలు చేయడం, అభిమానులను అలరించడమే పనిగా పెట్టుకున్నాడు. వార్నర్‌ వినోదాన్ని పంచినట్లు మరే క్రికెటర్‌ పంచలేదంటే అతిశయోక్తి కాదేమో. ఒకవైపు లాక్‌డౌన్‌ సమయాన్ని ఆస్వాదిస్తూనే.. మరొకవైపు అభిమానులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నాడు.

విపరీతమైన క్రేజ్

విపరీతమైన క్రేజ్

టిక్‌టాక్‌లో డేవిడ్‌ వార్నర్ చేసిన వీడియోలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ వచ్చేసింది. భాష రాకున్నా.. లిప్ ‌సింక్‌తో అన్నింట్లోనూ అదరగొడుతున్నాడు. ముఖ్యంగా తెలుగు సినిమా డైలాగులు, పాటలకు తనదైన నటన జోడిస్తున్న డేవిడ్ వార్నర్ ఆ వీడియోల్లో తన సతీమణి క్యాండిస్‌ను కూడా ఆహ్వానిస్తున్నాడు. దీంతో పలు వీడియోల్లో ఇద్దరూ కలిసి చిందులేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వార్నర్‌ దంపతులు శనివారం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ‌బాబు నటించిన బ్లాక్‌బస్టర్‌ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని 'మైండ్‌బ్లాక్'‌ పాటకు చిందులేశారు.

మాయ చేసిన‌ వార్నర్‌

మాయ చేసిన‌ వార్నర్‌

ఇక ఆదివారం డేవిడ్ వార్నర్‌ మరో వీడియోతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ట్రెడ్‌మిల్‌ మీద నడుస్తున్నట్లుగానే గాల్లో నడవడం ఆశ్చర్యకరంగా కనిపిస్తున్న వీడియోను పోస్టు చేసాడు. 'ఈ బద్దకమైన ఆదివారం నాడు చిప్స్‌ తింటూ.. గ్రావిటి ఛాలెంజ్'‌ అని పేర్కొన్నాడు. ఇది పోస్టు చేసిన గంటకే సుమారు రెండు లక్షల మంది లైక్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 లాక్‌డౌన్‌ విధించడంతో

లాక్‌డౌన్‌ విధించడంతో

మార్చి చివరి వారం నుండి లాక్‌డౌన్‌ విధించడంతో అన్ని క్రీడా ఈవెంట్లు స్తంభించిపోయాయి. దీంతో క్రీడా సమాఖ్యలకు ఆదాయం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) సైతం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దీంతో ఇప్పుడు టీమిండియాతో మూడు ఫార్మాట్ల సిరీస్‌లు ఆడడానికి సిద్ధపడింది. అక్టోబర్‌లో టీ20 సిరీస్‌, తర్వాత నవంబర్‌, డిసెంబర్‌లో వన్డే, టెస్టు సిరీస్‌లు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

బుట్ట బొమ్మతో మొదలు

డేవిడ్ వార్నర్‌ నెల రోజుల క్రితమే టిక్‌టాక్‌లోకి వచ్చాడు. అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంటపురంలో' సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్‌కి తన భార్య క్యాండీస్‌తో కలిసి వార్నర్ టిక్‌టాక్ వీడియో చేశాడు. ఆ వీడియోకి పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో.. అదే సినిమాలోని 'రాములో రాములా' పాటకి కూడా వార్నర్ దంపతులు కాలు కదిపారు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. మధ్యలో పోకిరి, బాహుబలి సినిమాలోని ఫేమస్ డైలాగ్‌లతో వార్నర్ టిక్‌టాక్ వీడియోలు చేశాడు. ఒక తమిళ పాట బీటుకూ వార్నర్‌ టిక్‌టాక్‌ చేశాడు. ఇక ఎన్‌టీఆర్‌ పుట్టినరోజున ఊహించని బహుమతి ఇచ్చాడు డేవిడ్‌ వార్నర్‌. భార్య క్యాండిస్‌తో కలిసి జనతా గ్యారేజ్‌లోని 'పక్కా లోకల్‌' పాటకు స్టెప్పులేశాడు. అవెంజర్స్‌, ముక్కాబులా టిక్‌టాక్‌లు కూడా చేసాడు. తాజాగా మైండ్‌ బ్లాక్‌ పార్ట్‌-2 చేసాడు.

Story first published: Monday, June 1, 2020, 14:41 [IST]
Other articles published on Jun 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+