Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటున్నా- డేవిడ్ వార్నర్

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 స్టేజ్‌లో ఆస్ట్రేలియా నిష్క్రమించడంతో వార్నర్ మౌనంగా ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ప్రారంభం కాకముందే వార్నర్ తన రిటైర్మెంట్ గురించి ముందే ప్రకటన చేశాడు. మెగాటోర్నీ ముగిసిన అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు తెలిపాడు.

అంతకుముందు వన్డే ప్రపంచకప్ 2023 విజయానంతరం వార్నర్ వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో సిడ్నీ టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. అయితే వార్నర్ తాజాగా తన మనసు మార్చుకున్నాడు. ఆస్ట్రేలియా తరఫున మరోసారి ఆడాలని ఉందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అధ్యాయం ముగిసింది అని అంటూనే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతానని వార్నర్ పేర్కొన్నాడు.

David Warner Declares End of Cricket Career Yet Considers 2025 Champions Trophy for Australia

సెలక్టర్లు ఎంపిక చేస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగుతానని డేవిడ్ వార్నర్ అన్నాడు. ''అధ్యాయం ముగిసింది. సుదీర్ఘ కాలం అత్యున్నత క్రికెట్ ఆడటం గొప్ప అనుభూతి. ఆస్ట్రేలియా నా జ‌ట్టు. అంతర్జాతీయ స్థాయితోనే నా కెరీర్ ఎక్కువ‌గా స‌రిపోయింది. ఇలా ఆడటం గర్వంగా ఉంది. అన్ని ఫార్మాట్లలో 100+ మ్యాచ్‌లు ఆడటం నా ఆటలో హైలైట్. ఈ ప్రయాణంలో స‌హ‌క‌రించిన అందరికి ధ‌న్య‌వాదాలు''

''మన అనుభూతి, అనుభవం ఇతరులకు ఎవరికీ తెలియదు. క్రికెట్ అభిమానులందరినీ నేను అలరించానని అనుకుంటున్నా. ముఖ్యంగా టెస్టుల్లో! ఇతరుల కంటే వేగంగా ఆడుతూ ఫ్యాన్స్‌ను అలరించాను. ఇక కొన్నాళ్లు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడతాను. అలాగే నేను ఎంపికైతే, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాను'' అని డేవిడ్ వార్నర్ పేర్కొన్నాడు.

2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన 37 ఏళ్ల వార్నర్ సుమారు 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు. వార్నర్ 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 8786, వన్డేల్లో 6932 పరుగులు, పొట్టి ఫార్మాట్‌లో 3277 రన్స్ సాధించాడు.

Story first published: Tuesday, July 9, 2024, 10:34 [IST]
Other articles published on Jul 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+