For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

త‌గ్గెదేలే! పుష్ప‌లోని శ్రీ‌వ‌ల్లి పాటకు వార్న‌ర్ బాబాయి అదిరిపోయే స్టెప్పులు

David Warner dances to the song Srivalli in Pushpa Movie

ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌కు తెలుగు సినిమాలంటే ఎంత అభిమాన‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌సరం లేదు. అందులో మ‌రి ముఖ్యంగా అల్లు అర్జున్ చిత్రాల‌ను వార్న‌ర్ ఎంత‌లా అభిమానిస్తాడో తెలిసిందే. గ‌తంలో అల్లు అర్జున్ న‌టించిన అల వైకుంఠ‌పురంలోని సాంగ్స్‌కు ఫ్యామిలీతో క‌లిసి స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప‌ డైలాగ్‌ల‌తోపాటు సాంగ్స్‌కు స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నాడు. వార్న‌ర్‌కు తెలుగు సినిమాల‌తో ఈ మ‌మ‌కారం అంతా కూడా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన స‌మ‌యంలో ఏర్పడింది. అప్ప‌టి నుంచి తెలుగు సినిమాల పాట‌ల‌కు స్టెప్పులేయ‌డం, డైలాగ్‌లు చెప్ప‌డం వార్న‌ర్‌కు అలవాటుగా మారిపోయింది. వార్న‌ర్ ప్ర‌తిభ‌ను అభిమానులు కూడా బాగా ఆద‌రిస్తున్నారు. అయితే మ‌రోసారి అభిమానుల‌ను ఉత్సాహ ప‌ర‌చడానికి తెలుగు సినిమా పాట‌తో డేవిడ్ వార్న‌ర్ మ‌ళ్లీ వ‌చ్చేశాడు.

తాజాగా అల్లు అర్జున్ చిత్రంలోని శ్రీ‌వ‌ల్లి సాంగ్ బాగా పాపుల‌ర్ అయింది. అందులో ఆ పాట‌కు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు అయితే అంత‌కు మించి పాపుల‌ర్ అయ్యాయి. దీంతో శ్రీ‌వ‌ల్లి పాట‌కు డేవిడ్ వార్న‌ర్‌ స్టెప్పులేసి అద‌ర‌గొట్టాడు. అచ్చం అల్లు అర్జున్ లాగే పాదాల‌ను క‌దిలించాడు. అల్లు అర్జున్ మాదిరిగానే క‌ళ్ల‌ద్దాలు పెట్టుకోని భుజం ఒక వైపు పైకి లేపి పాదాల‌ను క‌దిలించాడు. చివ‌ర్లో తగ్గెదేలే సింబ‌ల్‌తో ఆకట్టుకున్నాడు. ఇలా అల్లు అర్జున్‌ను మ‌రిపించే ప్ర‌ద‌ర్శ‌న‌తో డేవిడ్ వార్న‌ర్ అద‌ర‌గొట్టాడు. ఈ వీడియోను వార్న‌ర్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయ‌గా నిముషాల్లోనే వైర‌ల్‌గా మారింది. ఇక అభిమానులైతే లైక్‌లు, కామెంట్లు, షేర్ల‌తో హోరెత్తిస్తున్నారు. వార్న‌ర్ బాబాయిని ప్ర‌శంస‌లతో ముంచెత్తుతున్నారు.

గ‌తంలో కూడా పుష్ప‌లోని త‌గ్గేదేలే డైలాగ్ చెప్పి డేవిడ్ వార్న‌ర్ ఆక‌ట్టుకున్నాడు. అలాగే ఏయ్ బిడ్డ.. ఇది నా అడ్డ పాటకు స్టెప్పులు ఇర‌గ‌దీశాడు. అది చూసిన హీరో అల్లు అర్జున్ యవ్వ తగ్గేదేలే వార్నర్‌.. అంటూ క్యాప్షన్ పెట్టాడు. కాగా ఐపీఎల్‌లో వార్నర్ బాబాయి ఈ ఏడాది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌డం దాదాపు అసాధ్య‌మ‌నే చెప్పుకోవాలి. స‌న్‌రైజ‌ర్స్ రిటెన్ష‌న్ జాబితాలో కూడా వార్న‌ర్ లేడు. అయితే తాజా సమాచారం ప్ర‌కారం డేవిడ్ వార్న‌ర్‌ను మెగా వేలంలో కొనుగోలు చేయాల‌ని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు భావిస్తోంద‌ట‌. వార్న‌ర్‌ను కొనుగోలు చేసి బెంగ‌ళూరు కెప్టెన్‌గా నియ‌మించే అవ‌కాశం ఉంది.

Story first published: Friday, January 21, 2022, 17:51 [IST]
Other articles published on Jan 21, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+