Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది చేయకుంటే.. కాండీస్ నన్ను చంపేస్తుంది: వార్నర్

David Warner Dances To Mahesh Babus Song Again, Admits Wife Candice Kills Me With Moves

సిడ్నీ: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ మైదానంలోకి దిగితే.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడం అలవాటు. లాక్‌డౌన్‌లో బ్యాటు పట్టే అవకాశం లేకపోవడంతో మొబైల్‌ పట్టాడు. ఇక సోషల్‌ మీడియాలో బ్యాటింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. కుటుంబ సమేతంగా వీడియోలు చేయడం, అభిమానులను అలరించడమే పనిగా పెట్టుకున్నాడు. వార్నర్‌ వినోదాన్ని పంచినట్లు మరే క్రికెటర్‌ పంచలేదంటే అతిశయోక్తి కాదేమో. ఒకవైపు లాక్‌డౌన్‌ సమయాన్ని ఆస్వాదిస్తూనే.. మరొకవైపు అభిమానులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నాడు.

మైండ్‌ బ్లాక్ పా​ర్ట్‌-2:

మైండ్‌ బ్లాక్ పా​ర్ట్‌-2:

టిక్‌టాక్‌లో డేవిడ్‌ వార్నర్ చేసిన వీడియోలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ వచ్చేసింది. భాష రాకున్నా.. లిప్ ‌సింక్‌తో అన్నింట్లోనూ అదరగొడుతున్నాడు. ముఖ్యంగా తెలుగు, హిందీ సినిమా పాటలకు డ్యాన్స్‌ ఇరగదీస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా వార్నర్‌ చేసిన మరో టిక్‌టాక్‌ వీడియో అభిమానుల్ని తెగ అలరిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలోని 'మైండ్‌ బ్లాక్‌' పాటకు ఆసీస్ ఓపెనర్ మరోసారి టిక్‌టాక్‌ చేసాడు. ఈ పాటకు సంబంధించిన స్టెప్పులతో పా​ర్ట్‌-2 విడుదల చేశాడు.

డాన్స్ చేయకుంటే.. కాండీస్ నన్ను చంపేస్తుంది:

డాన్స్ చేయకుంటే.. కాండీస్ నన్ను చంపేస్తుంది:

తన భార్య కాండిస్‌ మాదిరిగా తాను డ్యాన్స్‌ చేయలేకపోయానని డేవిడ్ వార్నర్‌ చెప్పుకొచ్చాడు. మైండ్‌ బ్లాక్‌ పార్ట్‌-2 లో కాండిస్‌ డ్యాన్స్‌ ఇరగదీసిందని మెచ్చుకున్నాడు. దీనికి మూడో పార్ట్‌ కూడా ఉంటుందని వార్నర్‌ తెలిపాడు. 'రెండో పార్ట్. ఇది చాలా కఠినమైంది. కానీ డాన్స్ చేయకుంటే.. కాండీస్ నన్ను చంపేస్తుంది. మూడో పార్ట్ కావాలా?' అంటూ వార్నర్.. మహేశ్ బాబు, రష్మికా మందన్నలను ట్యాగ్ చేశాడు. డియర్ (కాండిస్‌)‌.. నీ ముందు తేలిపోయా.. నేను చెత్తగా డ్యాన్స్‌ చేశా అని వార్నర్ పేర్కొన్నాడు.

త్వరలోనే మరో టిక్‌టాక్‌:

త్వరలోనే మరో టిక్‌టాక్‌:

డేవిడ్ వార్నర్‌ తాజా టిక్‌టాక్‌ వీడియో మహేశ్ బాబు‌తో పాటు ఓవరాల్‌ టాలీవుడ్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. మైండ్‌ బ్లాక్‌ పాటకు టిక్‌టాక్‌ చేయాల్సిందిగా వార్నర్‌ను ఫ్యాన్స్‌ కోరడంతోనే ఈ టిక్‌టాక్‌ చేసాడు. అభిమానుల కోరిక మేరకు అతడు పడుతున్న కష్టానికి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పాటకు సంబంధించి మరో టిక్‌టాక్‌ వీడియో త్వరలోనే విడుదల చేస్తానని వార్నర్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం వార్నర్‌ ‘మైండ్‌ బ్లాక్‌' టిక్‌టాక్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

బుట్ట బొమ్మతో మొదలు:

డేవిడ్ వార్నర్‌ నెల రోజుల క్రితమే టిక్‌టాక్‌లోకి వచ్చాడు. అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంటపురంలో' సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్‌కి తన భార్య క్యాండీస్‌తో కలిసి వార్నర్ టిక్‌టాక్ వీడియో చేశాడు. ఆ వీడియోకి పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో.. అదే సినిమాలోని 'రాములో రాములా' పాటకి కూడా వార్నర్ దంపతులు కాలు కదిపారు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. మధ్యలో పోకిరి, బాహుబలి సినిమాలోని ఫేమస్ డైలాగ్‌లతో వార్నర్ టిక్‌టాక్ వీడియోలు చేశాడు. ఒక తమిళ పాట బీటుకూ వార్నర్‌ టిక్‌టాక్‌ చేశాడు. ఇక ఎన్‌టీఆర్‌ పుట్టినరోజున ఊహించని బహుమతి ఇచ్చాడు డేవిడ్‌ వార్నర్‌. భార్య క్యాండిస్‌తో కలిసి జనతా గ్యారేజ్‌లోని 'పక్కా లోకల్‌' పాటకు స్టెప్పులేశాడు. అవెంజర్స్‌, ముక్కాబులా టిక్‌టాక్‌లు కూడా చేసాడు.

Story first published: Sunday, May 31, 2020, 18:21 [IST]
Other articles published on May 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+