Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pak vs Aus: మైదానంలో పంజాబీ డ్యాన్స్‌తో దుమ్ములేపిన వార్న‌ర్ బాబాయి.. వీడియో వైర‌ల్‌!

David Warner dances Punjabi in the first Test match against Pakistan vs Australia

రావల్పిండి: ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ త‌న‌లోని టాలెంట్‌ను మ‌రోసారి బయ‌టికి తీశాడు. ఎప్పుడూ ఇంట్లో వీడియోలు చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేసే వార్న‌ర్ ఈ సారి ఏకంగా మైదానంలో త‌న టాలెంట్‌ను చూపించాడు. అది కూడా పాకిస్థాన్‌లో పంజాబీ డ్యాన్స్ చేసి మ‌రి క్రికెట్ అభిమానుల‌కు త‌న టాలెంట్‌ను ప్ర‌త్య‌క్షంగా చూపించాడు. స‌ద‌రు వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేయ‌గా ప్ర‌స్తుతం అది నెట్టింట వైర‌ల్‌గా మారింది.

పంజాబీ డ్యాన్స్‌

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ‌ధ్య జ‌ర‌గుతున‌న తొలి టెస్ట్ మ్యాచ్ చివ‌రి రోజు ఆట‌లో ఫీల్డింగ్ స‌మయంలో డేవిడ్ వార్న‌ర్ నృత్యం చేయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అది కూడా పాకిస్థాన్‌లో భార‌త్‌కు చెందిన పంజాబీ డ్యాన్స్ చేయ‌డం విశేషం. చేతులు పైకెత్తి, న‌డుస్తూ స్టెప్పులేసి వార్న‌ర్ ఆక‌ట్టుకున్నాడు. ఇలా డ్యాన్స్ చేస్తూ తోటి ఆట‌గాళ్ల‌తోపాటు పాటు మైదానానికి వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను కూడా వార్న‌ర్ బాబాయి ఉత్సాహప‌రిచాడు. దీంతో డేవిడ్ వార్న‌ర్ టాలెంట్‌ను ప్ర‌స్తుతం అంతటా ప్ర‌శంసిస్తున్నారు.

 తెలుగు పాట‌ల‌కు డ్యాన్స్‌

తెలుగు పాట‌ల‌కు డ్యాన్స్‌

35 ఏళ్ల డేవిడ్ వార్న‌ర్ ఇప్ప‌టికే తెలుగు పాట‌లకు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకున్నాడు. తెలుగు సినిమా డైలాగుల‌ను ఇమిటేట్ చేశాడు. తెలుగు హిరోల ఫేస్‌ల‌ను మార్ఫింగ్ చేసిన త‌న ఫేస్‌తో డైలాగులు చెప్పి ఆక‌ట్టుకున్నాడు. త‌న భార్య‌, పిల్ల‌ల‌తో కూడా క‌లిసి డ్యాన్స్ చేసిన వీడియోల‌ను కూడా వార్న‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇలా ఆట‌తోనే కాకుండా డ్యాన్సులు, డైలాగ్‌ల‌తో ఇండియాకు వార్న‌ర్ మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. కాగా వార్న‌ర్‌కు కూడా భార‌తదేశంపై ప్ర‌త్యేక అభిమానం ఉంది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌లోకి వార్న‌ర్

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌లోకి వార్న‌ర్

డేవిడ్ వార్న‌ర్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డులు ఉన్నాయి. దీంతో మెగా వేలంలో వార్న‌ర్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ కొనుగోలు చేసింది. 6 కోట్ల‌ 25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు వార్న‌ర్‌ను ఢిల్లీ ద‌క్కించుకుంది. ఐపీఎల్‌లో డేవిడ్ వార్న‌ర్ గ‌తంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. కాగా ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 150 మ్యాచ్‌లు ఆడిన వార్న‌ర్ 41 స‌గ‌టుతో 5,449 ప‌రుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా.. అత్య‌ధిక స్కోర్ 126 ప‌రుగులు.

రాణించిన వార్న‌ర్

రాణించిన వార్న‌ర్

ఇక పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో డేవిడ్ వార్న‌ర్ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 68 ప‌రుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 476 ప‌రుగులు చేయ‌గా.. ఆస్ట్రేలియా 459 ప‌రుగులు చేసింది. అనంత‌రం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 200 ప‌రుగులు దాటిన వికెట్ కోల్పోలేదు. కాగా ఆట‌కు మంగ‌ళవార‌మే చివ‌రి రోజు కావ‌డంతో ఈ మ్యాచ్ డ్రా కావ‌డం ఖాయ‌మైపోయింది.

Story first published: Tuesday, March 8, 2022, 17:12 [IST]
Other articles published on Mar 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+