Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌కు భారీ లక్ష్యం: మరో రికార్డు నెలకొల్పిన వార్నర్

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. మంగళవారం ప్రారంభమైన ఈ టెస్టు తొలి సెషన్‌లోనే సెంచరీ సాధించి 40 ఏళ్లుకు పైగా ఉన్న రికార్డుని బద్దలు కొట్టిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెండో ఇన్నింగ్స్‌లో మరో రికార్డు నెలకొల్పాడు.

నాలుగో రోజు ఆటలో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ టెస్టుల్లో రెండో వేగవంతమైన అర్ధసెంచరీని సాధించాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా టెస్టుల్లో రెండో ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.

రెండో ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీని నమోదు చేసిన వార్నర్

రెండో ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీని నమోదు చేసిన వార్నర్

రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ 27 బంతులాడి 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. అతడు చేసిన పరుగుల్లో 50 పరుగులు బౌండరీల రూపంలో రావడం విశేషం. అయితే ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ రికార్డు మాత్రం పాకిస్తాన్ కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ పేరిట ఉండటం విశేషం.

ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ రికార్డు మాత్రం మిస్బాదే

ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ రికార్డు మాత్రం మిస్బాదే

2014 15 సీజన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిస్బా ఉల్ హాక్ ఆ రికార్డు నెలకొల్పాడు. అంతకముందు టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన రికార్డు ఆసీస్ ఆటగాడు యార్డ్ లీ పేరిట ఉండేది. ఇదిలా ఉంటే రెండో ఇన్నింగ్స్‌లో 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాక్ బౌలర్ వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో వార్నర్ పెవిలియన్‌కు చేరాడు.

తొలి ఇన్నింగ్స్‌ను 538/8 పరుగుల వద్ద డిక్లేర్

తొలి ఇన్నింగ్స్‌ను 538/8 పరుగుల వద్ద డిక్లేర్

నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అజహర్ అలీ 11, యాసిర్ షా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌ను 538/8 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, పాకిస్థాన్ 315 పరుగులు చేసింది.

ఇంకా 410 పరుగుల వెనుకబడే ఉంది

ఇంకా 410 పరుగుల వెనుకబడే ఉంది

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, ఖవాజా, స్మిత్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో 31 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను 241/2 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పాకిస్థాన్ ఇంకా 410 పరుగుల వెనుకబడి ఉంది.

టెస్టుల్లో 18 సెంచరీలు చేసిన వార్నర్

టెస్టుల్లో 18 సెంచరీలు చేసిన వార్నర్

సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్ 78 బంతుల్లో సెంచరీ చేసి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. గత నలబై ఏళ్లలో ఈ ఫీట్ నెలకొల్పిన తొలి ఆటగాడు వార్నర్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకూ టెస్టుల్లో వార్నర్ 18 సెంచరీలను నమోదు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+