Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

David Warner: రికార్డులే పోటీపడేలా చరిత్ర సృష్టించిన వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచే తన వన్డే కెరీర్‌లో చివరిదని తెలిపాడు. మరోవైపు టెస్టు ఫార్మాట్‌‌లో వార్నర్ ఆఖరి టెస్టు జనవరి 3న ఆడనున్నాడు. సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఆ టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు అతడు వీడ్కోలు పలుకుతున్నాడు. టెస్టు రిటైర్మెంట్ గురించి ముందే ప్రకటించిన వార్నర్ వన్డేలకు అనూహ్యంగా గుడ్‌బై చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే వార్నర్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు స‌ృష్టించాడు. 1877 తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. మూడు ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆసీస్ ఆటగాడిగా వార్నర్ రికార్డు నెలకొల్పాడు. అలాగే వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఆసీస్ ప్లేయర్‌గానూ వార్నర్ రికార్డులకెక్కాడు. ఈ రెండు రికార్డుల్లో తొలి స్థానంలో రికీ పాంటింగ్ ఉన్నాడు.

David Warner created history to compete with records

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన విదేశీ ప్లేయర్‌గా వార్నర్ రికార్డు నెలకొల్పాడు. 6397 పరుగులు చేసిన వార్నర్ ఓవరాల్‌గా మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాల్లో విరాట్ కోహ్లి (7263), శిఖర్ ధావన్ (6617) ఉన్నారు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్న ప్లేయర్‌గానూ వార్నర్ నిలిచాడు. వార్నర్ 2015, 2017, 2019 సీజన్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఇక వన్డేల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా వార్నర్ చరిత్రకెక్కాడు. 2016లో వార్నర్ ఏడు శతకాలు సాధించాడు. తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ 1998లో ఏకంగా తొమ్మిది సెంచరీలు చేశాడు. మరోవైపు ఓపెనర్‌గా టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన అయిదో ప్లేయర్‌గా వార్నర్ నిలిచాడు. పాకిస్థాన్‌పై వార్నర్ 335* పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో వరుస ఇన్నింగ్స్‌లో ఆరు అర్ధశతకాలు సాధించి ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. అలాగే టెస్టుల్లో 5000 పరుగులతో పాటు 50కు పైగా క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గానూ రికార్డు నెలకొల్పాడు.

ఇక 161 వన్డేల్లో వార్నర్ 45 సగటుతో 6932 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 111 టెస్టులు ఆడిన వార్నర్ 8695 పరుగులు చేశాడు. టెస్టుల్లో వార్నర్ 26 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు సాధించాడు.

Story first published: Monday, January 1, 2024, 12:56 [IST]
Other articles published on Jan 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+