SRH VS RR: డబుల్ ధమాకా - హైదరాబాద్ వచ్చిన వార్నర్
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా. నగరంలో ఓవైపు ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2025 సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుండగా.. మరోవైపు సన్‌రైజర్స్ మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ భాగ్యనగరానికి వచ్చాడు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో ఆయన్ని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇంతకీ ఆయన ఎందుకు వచ్చాడంటే
డేవిడ్ వార్నర్ కు తెలుగు సినిమాలన్నా, తెలుగు ప్రజలన్నా ఎంతో ఇష్టం. తరచుగా టాలీవుడ్ స్టార్ హీరోలపై రీల్స్ కూడా చేస్తుంటాడు. తెలుగు సినిమా డైలాగ్స్, పాటలకు సరదా వీడియోలు చేసి ఆకట్టుకుంటుంటాడు.అందుకే అతడికి తెలుగు ప్రజల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే నితిన్ రాబిన్‌హుడ్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో డేవిడ్ అనే పాత్రలో వార్నర్ యాక్ట్ చేశాడు.

తాజాగా ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ కు వచ్చాడు వార్నర్. దీంతో నగరానికి వచ్చిన అతడిని చిత్రబృందం ఘన స్వాగతం పలికింది. మార్చి 23 (నేడు) సాయంత్రం 'రాబిన్‌హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో వార్నర్ పాల్గొననున్నాడు. అలానే చిత్రంలో నటించడంపై మాట్లాడి.. సినిమా విశేషాలను పంచుకోనున్నాడు.
కాగా, వార్నర్ పాత్రను ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని, సెకండాఫ్‌లో అతడి పాత్ర కనిపిస్తుంది అని మూవీటీమ్ చెబుతోంది. చూడాలి మరి ఈ సినిమాతో వార్నర్ తెలుగు అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో...
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications