సెంచరీతో చెలరేగిన వార్నర్: 19వ సెంచరీ, 17వ ఆటగాడు
హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగి ఆడుతున్నాడు. 143 బంతులను ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్ 17 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 144 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు.
వార్నర్‌కి ఇది టెస్టుల్లో 17వ సెంచరీ కావడం విశేషం. దీంతో టెస్టుల్లో ఐదువేల పరుగులు పూర్తిచేసుకున్న 19వ ఆస్ట్రేలియా ఆటగాడిగా వార్నర్ గుర్తింపు పొందాడు. మరో ఓపెనర్ రెన్షా 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఉస్మాన్ ఖవాజాతో కలిసి వార్నర్ వీర విహారం చేశాడు.
ఈ క్రమంలో 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో ఉస్మాన్ ఖవాజా (73 నాటౌట్)తో అర్ధ సెంచరీని సాధించాడు. జట్టు స్కోరును మరింత పెంచే క్రమంలో 244 పరుగుల వద్ద వహాబ్ రియాజ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వార్నర్ వెనుదిరిగాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది.

కాగా, పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ ను 443/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఇంకా 165 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ డబుల్ సెంచరీ (205 నాటౌట్) నమోదు చేశాడు.
310/6 ఓవర్ నైట్ స్కోరుతో బుధవారం ఆటను కొనసాగించిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది. బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజైన బుధవారం పాక్ ఇన్నింగ్స్‌లో అజహర్ అలీ డబుల్ సెంచరీ చేయగా, సోహైల్ ఖాన్, అసద్ షఫీఖ్ అర్ధసెంచరీలను నమోదు చేశారు.
మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అజహర్ అలీ డబుల్ సెంచరీ సాధించడంతో ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి పాక్ క్రికెటర్ గానూ రికార్డు నెలకొల్పాడు. మరోవైపు మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పలు రికార్డులను సైతం అజహర్ అలీ నమోదు చేశాడు. పాకిస్ధాన్ జట్టు నుంచి ఈ స్డేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా అజహర్ అలీ చరిత్ర సృష్టించాడు.
గతంలో పాక్ ఆటగాడు మాజిద్ ఖాన్ 158 పరుగుల రికార్డుని ఈ ఇన్నింగ్స్‌లో అజహర్ అలీ అధిగమించాడు. ఇక మెల్‌బోర్న్ స్డేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 1984లో వెస్డిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ చేసిన 208 పరుగులే ఇక్కడ ఇప్పటివరకు అత్యధిక స్కోరు కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications