వైరల్ వీడియో.. శిల్పాశెట్టితో వార్నర్ టిక్​టాక్!!

సిడ్నీ: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ మైదానంలోకి దిగితే.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడం అలవాటు. లాక్‌డౌన్‌లో బ్యాటు పట్టే అవకాశం లేకపోవడంతో మొబైల్‌ పట్టాడు. ఇక సోషల్‌ మీడియాలో బ్యాటింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. కుటుంబ సమేతంగా టిక్​టాక్ వీడియోలు చేయడం, అభిమానులను అలరించడమే పనిగా పెట్టుకున్నాడు. వార్నర్‌ వినోదాన్ని పంచినట్లు మరే క్రికెటర్‌ పంచలేదంటే అతిశయోక్తి కాదేమో. ఒకవైపు లాక్‌డౌన్‌ సమయాన్ని ఆస్వాదిస్తూనే.. మరొకవైపు అభిమానులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా వార్నర్‌ మరో వీడియోతో మనముందుకొచ్చాడు.

#Watch:David Warner Can't కంట్రోల్ His Laughter After Seeing Shilpa Shetty's వీడియో !

శిల్పాశెట్టితో వార్నర్ టిక్​టాక్:

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టితో డేవిడ్ వార్నర్ ఓ సరదా టిక్​టాక్ వీడియో చేశాడు. ఫేస్ ఫిల్టర్ సాయంతో శిల్ప తన ముఖాన్ని బొమ్మలా మార్చి విచిత్రమైన గొంతుతో పాట పాడుతున్నట్టు యాక్ట్ చేయగా.. ఆల్​లైన్​లో ఉన్న వార్నర్​ నవ్వు ఆపుకోలేకపోయాడు. వీడియో ఆసాంతం నవ్వులు పూయించాడు. దీనికి సంబందించిన వీడియోను వార్నర్ శుక్రవారం ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. 'ఈ వీడియో నన్ను ఎంతగానో నవ్విస్తోంది. క్రేజీ టైమ్​' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు.

ముక్కాబుల పాటకి డాన్స్:

ముక్కాబుల పాటకి డాన్స్:

ఇటీవల డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఎవర్ గ్రీన్ 'ముక్కాలా ముక్కాబుల' పాటకి డేవిడ్ వార్నర్ తన భార్య కాండీస్‌తో కలిసి డాన్స్ చేశాడు. స్ట్రీట్ డాన్సర్ మూవీ కోసం 'ముక్కాల ముక్కాబుల' సాంగ్ ని రీమిక్స్ చేయగా.. ఆ పాటకు వార్నర్ స్టెప్పులు చేసి ఆకట్టుకున్నారు. 'మా ఇద్దరిలో బెటర్ డ్యాన్సర్ ఎవరో చెప్పండి' అంటూ ఓ క్వశ్చన్ విసిరాడు. ఆ వీడియోకి ప్రభుదేవా మరియు శిల్పా శెట్టిలను ట్యాగ్ చేసాడు. అప్పుడు శిల్పా రిప్లై ఇచ్చి.. ఇప్పుడు ఏకంగా టిక్​టాక్ వీడియోనే చేసారు.

బుట్ట బొమ్మతో మొదలు:

బుట్ట బొమ్మతో మొదలు:

డేవిడ్ వార్నర్‌ రెండు రోజుల క్రితమే టిక్‌టాక్‌లోకి వచ్చాడు. అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంటపురంలో' సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్‌కి తన భార్య క్యాండీస్‌తో కలిసి వార్నర్ టిక్‌టాక్ వీడియో చేశాడు. ఆ వీడియోకి పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో.. అదే సినిమాలోని 'రాములో రాములా' పాటకి కూడా వార్నర్ దంపతులు కాలు కదిపారు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. మధ్యలో పోకిరి, బాహుబలి సినిమాలోని ఫేమస్ డైలాగ్‌లతో టిక్‌టాక్ వీడియోలు చేశాడు. ఒక తమిళ పాట బీటుకూ టిక్‌టాక్‌ చేశాడు. ఇక ఎన్‌టీఆర్‌ పుట్టినరోజున ఊహించని బహుమతి ఇచ్చాడు‌. భార్య క్యాండిస్‌తో కలిసి జనతా గ్యారేజ్‌లోని 'పక్కా లోకల్‌' పాటకు స్టెప్పులేశాడు. అవెంజర్స్‌, ముక్కాబులా టిక్‌టాక్‌లు కూడా చేసాడు.

భారత విద్యార్థిని పొగిడిన వార్నర్‌:

భారత విద్యార్థిని పొగిడిన వార్నర్‌:

ఆస్ట్రేలియాలో చదువుతున్న ఓ భారతీయ విద్యార్థిని డేవిడ్ ‌వార్నర్‌ మెచ్చుకున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల్లో అతను చేస్తున్న కృషికి వార్నర్‌ ధన్యవాదాలు చెప్పాడు. బెంగుళూరుకు చెందిన శ్రేయస్‌ శ్రేష్ఠ్‌.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం అక్కడ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు పోయి అనేక మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. యూనివర్సిటీ సామాజిక సేవ బృందంలో చేరి.. అక్కడ కష్టాల్లో ఉన్న విద్యార్థులకు భోజన సదుపాయాలు అందిస్తున్నాడు శ్రేయస్‌. అతని సేవలను గుర్తించిన వార్నర్‌ ఒక వీడియోలో అభినందించాడు.

విరాట్ కోహ్లీ ఒక్కడు కాదు.. పదకొండు మందితో సమానం: పాక్ దిగ్గజం

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, June 13, 2020, 9:36 [IST]
Other articles published on Jun 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X