ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు తెలుగు ప్రజలన్నా.. తెలుగు ప్రజలకు వార్నర్ అన్నా.. ఎంత ఇష్టమో ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. ఇప్పటికే అతడు బాహుబలి, పుష్ప, డీజే టిల్లు అంటూ పలువురు టాలీవుడ్ సినిమా హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ ఎన్నో రీల్స్, వీడియోలు చేయగా అవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడతడు ఏకంగా తెలుగు వెండితెరపై సందడి చేయనున్నాడు. అవును, మీరు చదువుతున్నది నిజమే.
వాస్తవానికి, వార్నర్ హీరో నితిన్ నటించిన రాబిన్‌హుడ్‌లో కనిపిస్తాడని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడా ప్రచారాన్ని నిజం చేస్తూ నిర్మాత రవిశంకర్ ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. రాబిన్‌హుడ్‌లో వార్నర్ అతిథి పాత్ర పోషించినట్టు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో తాజాగా నిర్వహించిన 'కింగ్‌స్టన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని రవిశంకర్ వెల్లడించారు.

'లీక్ ఏదైనా ఇస్తే బాగుంటుంది' అని యాంకర్ అడగగా.. "సినిమాలో కేమియో రోల్ లో డేవిడ్ వార్నర్ నటించారు. డేవిడ్ పాత్ర చాలా ఎక్సైట్ గా ఉంటుంది. ఆయన్ను మన ఇండియా సినిమాలో రాబిన్‌హుడ్‌తో లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది." అని చెప్పుకొచ్చారు.
1st day ye mathram miss avvanu ee Movie ki 💥🤣😂 Devid mama acting ela untadho chudali 🙂🤣
— Praveen K (@PK4NTR) March 4, 2025
Eagerly waiting for the movie 🎥🔥
Nithiin - David Warner
What a combination 🙌 pic.twitter.com/ESos5j55I4
కాగా, రాబిన్‌హుడ్ సినిమా చిత్రీకరణ గతేడాది ఆస్ట్రేలియాలో జరిగింది. ఆ సమయంలో వార్నర్‌కు సంబంధించిన కొన్ని సినిమా స్టిల్స్ కూడా బటయకు వచ్చాయి. కానీ అప్పుడు రాబిన్ హుడ్ టీమ్ ఈ విషయం గురించి ఏం మాట్లాడలేదు. సినిమాలో నితిన్ హీరోగా నటించారు. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సినిమా వచ్చే నెల 28న రిలీజ్ కానుంది.