7000 పరుగులు: డేవిడ్ వార్నర్ ఖాతాలో మరో రికార్డు, 12వ ఆటగాడిగా!

హైదరాబాద్: పెర్త్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 7000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్ చేరాడు. తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా శనివారం డేవిడ్ వార్నర్ ఈ మైలురాయిని అందుకున్నాడు.
మూడో రోజు ఆటలో భాగంగా 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డేవిడ్ వార్నర్ టెస్టుల్లో ఏడు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా టెస్టుల్లో ఏడువేల పరుగులు పూర్తి చేసుకున్న 12వ ఆస్ట్రేలియా క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఇది డేవిడ్ వార్నర్‌కు 151వ ఇన్నింగ్స్ కావడం విశేషం.

టెస్టుల్లో అత్యంత వేగంగా
దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా ఏడు వేల పరుగులు సాధించిన ఆసీస్ క్రికెటర్ల జాబితాలో గ్రెయిగ్ చాపెల్‌తో కలిసి ఐదో స్థానంలో నిలిచాడు. ఇటీవలే పాక్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో స్టీవ్ స్మిత్ 126 ఇన్నింగ్స్‌ల్లో టెస్టుల్లో ఏడు వేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది అత్యధిక
ఇక, ఈ ఏడాది అత్యధిక టెస్టు పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆసీస్ క్రికెటర్లు లబూషేన్(972), స్టీవ్ స్మిత్(857)లు తొలి రెండు స్థానాల్లో ఉండగా, డేవిడ్ వార్నర్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, తొలి టెస్టులో న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌటైంది.

రాస్ టేలర్ హాఫ్ సెంచరీ
కివీస్ ఆటగాళ్లలో రాస్ టేలర్(80) హాఫ్ సెంచరీ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా టెస్టు క్రికెట్‌లో 13వ సారి మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 109/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన కివీస్ మరో 57 పరుగులు చేసి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది.

ఐదు వికెట్లు తీసిన స్టార్క్
న్యూజిలాండ్ జట్టు స్కోరు 120 పరుగుల వద్ద ఉండగా వాట్లింగ్(8) ఔట్ కావడంతో ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. రాస్ టేలర్ ఏడో వికెట్‌గా, గ్రాండ్ హోమ్(23) ఎనిమిదో వికెట్ పెవిలియన్ చేరారు. 166 పరుగుల వద్ద మిచెల్ సాంత్నార్(2), సౌథీ(8)లు ఔట్ కావడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఆసీస్‌కు భారీ ఆధిక్యం
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఐదు, నాథన్ లయాన్ రెండు వికెట్లు తీయగా, హజిల్‌వుడ్, కమ్మిన్స్, లబూషేన్‌లు తలో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications