Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంగూలీతో సమం: పాంటింగ్‌ రికార్డు బ్రేక్ చేసిన వార్నర్

హైదరాబాద్: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డుని సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో వార్నర్ రెండు వన్డేల్లో రెండు సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో కూడా సెంచరీ నమోదు చేశాడు.

న్యూజిలాండ్‌పై జరుగుతున్న ఈ వన్డేలో వార్నర్ 95 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ చేశాడు. ఇది వార్నర్ కెరీర్‌లో 11వ సెంచరీ కాగా, ఒక కేలండర్ ఇయర్‌లో ఏడో సెంచరీ కావడం విశేషం. తాజా సెంచరీతో ఆసీస్ తరుపున అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ఐదు వన్డే సెంచరీలు

ఐదు వన్డే సెంచరీలు

ఈ వన్డేలో టాస్ గెలిచిన బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లకు గాను 8వికెట్లను కోల్పోయి 264 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వార్నర్ 156 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. ఇక ఆస్ట్రేలియా జట్టు తరుపున ఒక కేలండర్ ఇయర్‌లో ఐదు వన్డే సెంచరీలకు మించి ఇప్పటివరకు ఎవరూ చేయలేదు.

రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్‌లు మాత్రమే

రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్‌లు మాత్రమే

ఆసీస్ తరుపున గతంలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్‌లు మాత్రమే ఒక ఏడాదిలో ఐదు వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్లు. రికీ పాంటింగ్ 2003, 2007 సంవత్సరాల్లో ఐదేసి వన్డే సెంచరీలు సాధించగా, 2007లో హేడెన్ ఐదు సెంచరీలు నమోదు చేశాడు.

మొదటి స్ధానంలో సచిన్ టెండూల్కర్

మొదటి స్ధానంలో సచిన్ టెండూల్కర్

ఇక ఒక కేలండర్ ఇయర్‌లో వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మొట్టమొదటి స్ధానంలో ఉన్నాడు. 1998లో 34 వన్డే మ్యాచ్‌లాడిన క్రికెట్ లెజెండ్ 9 వన్డే సెంచరీలను సాధించి తొలిస్ధానంలో ఉన్నాడు.

గంగూలీ రికార్డు సమం

గంగూలీ రికార్డు సమం

ఆ తర్వాత 2000లో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ 32 మ్యాచ్‌లాడి ఒక ఏడాదిలో ఏడు వన్డేలు సాధించాడు. తాజాగా వార్నర్ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సరసన నిలిచాడు. అంతేకాదు ఒక కేలండర్ ఇయర్‌లో ఏడు వన్డే సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+