Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాంపరింగ్ నిషేదం నన్నింకా వేదిస్తోంది: డేవిడ్ వార్నర్

David Warner Ashamed Of Ball-Tampering Incident In South Africa

హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టు నుంచి కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవుల నుంచి ఏడాది పాటు నిషేదానికి గురైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు కలిసి ఆస్ట్రేలియా దేశీవాలీ లీగ్‌లో తొలి సారి ఆడుతున్నారు. బాల్‌ టాంపరింగ్‌ కారణంగా ఏడాదిపాటు నిషేదానికి గురై ఇప్పటికీ సిగ్గుపడుతున్నట్లు.. ఈ చర్య తననెంతగానో నిరాశకు గురిచేసిందని ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు.

 స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌ ఇద్దరూ ప్రత్యర్థులుగా

స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌ ఇద్దరూ ప్రత్యర్థులుగా

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో బాల్‌ టాంపరింగ్‌ కారణంగా స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌(ఏడాది పాటు), బెన్‌క్రాఫ్ట్‌(తొమ్మిది నెలలు) క్రికెట్‌ ఆస్ట్రేలియా సస్పెన్షన్‌ విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన వీళ్లు.. దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌ ఇద్దరూ ప్రత్యర్థులుగా ఆస్ట్రేలియాలోని దేశవాళీ టీ20లో తొలిసారిగా ఆడారు.

బాల్‌ టాంపరింగ్‌ చర్య నన్నెంతగానో

బాల్‌ టాంపరింగ్‌ చర్య నన్నెంతగానో

ఈ క్రమంలో వార్నర్‌ మాట్లాడుతూ.. ‘బాల్‌ టాంపరింగ్‌ చర్య నన్నెంతగానో నిరాశకు గురిచేసింది. అయితే సీఏ విధించిన ఏడాది సస్పెన్షన్‌ పూర్తి అయ్యేంత వరకూ శిక్ష అనుభవిస్తాను. అనంతరం తిరిగి వచ్చే ప్రపంచకప్‌ నాటికల్లా జాతీయ జట్టుకు ఆడటమే నా లక్ష్యం.' అని చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు కఠిన పరిస్థితులు

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు కఠిన పరిస్థితులు

కొద్దిరోజులుగా ఆస్ట్రేలియా ఆడుతున్న మ్యాచ్‌లలో పేలవమైన ఫామ్‌తో కొనసాగుతోంది. ఇటీవలే వన్డే ఫార్మాట్‌లో చాలాకాలం తర్వాత విజయం దక్కించుకుంది ఆస్ట్రేలియా. ఇంతకుముందు ఆడిన ఏడు వన్డే ఫార్మాట్లలోనూ ఆస్ట్రేలియా ఓటమితోనే కొనసాగుతూ వచ్చింది. మరోవైపు ఆసీస్‌-దక్షిణాఫ్రికా రెండో వన్డే గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది.

మూడు వన్డేలలో రెండింటిని ముగించి 1-1గా

మూడు వన్డేలలో రెండింటిని ముగించి 1-1గా

ఈ క్రమంలో రెండో వన్డేలో విజయం కోసం ఆటగాళ్లు చాలా శ్రమించారని వార్నర్‌ పేర్కొన్నాడు. ఆరోన్ పించ్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు పరిమిత ఓవర్లలో ‌సిరీస్‌లోనూ మూడు వన్డేలలో రెండింటిని ముగించి 1-1గా కొనసాగుతోంది. వచ్చే ఆదివారం బెల్లెరివ్ ఓవల్‌లోని హోబర్ట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు మూడు వన్డే ఆడనుంది.

Story first published: Sunday, November 11, 2018, 15:52 [IST]
Other articles published on Nov 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+