'అల దుబాయ్​లో' డేవిడ్ వార్నర్.. కోడి పుంజు పట్టుకుని అలా నడుస్తూ!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పేరు వింటేనే అభిమానులకు పూనకం వస్తుంది. ప్లేయర్ సిక్స్ కొట్టినా, వికెట్ తీసినా, క్యాచ్ పట్టినా.. అరుపులు, ఈలలతో మ్యాచ్ ఆసాంతం మైదానంలో ఒకటే సందడి చేస్తారు. ఇప్పడు క్రికెట్ ప్రపంచం మొత్తం ఐపీఎల్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆలస్యమైనా ఈ టోర్నీ యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుండే ఫ్యాన్స్ సందడి మొదలైంది. తమ అభిమాన క్రికెటర్ల ఫోటోలను కట్ చేసి అద్భుతంగా ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్, సన్​రైజర్స్ హైదరాబాద్​ కెప్టె​న్​ డేవిడ్ వార్నర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 అభిమాని మార్ఫింగ్:

అభిమాని మార్ఫింగ్:

అల వైకుంఠపురములో సినిమాలోని 'సితరాల సిరపడు' పాటలో టాలీవుడ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక చేతిలో కోడి, మరో చేతిలో కత్తి పట్టుకుని విలన్ ఇంటికి వెళ్లే సీన్‌కు అరుపులు, విజిల్స్​తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అంతలా అతడి స్టైల్ అభిమానులను అలరించింది. ఫాన్స్ ఇప్పుడు ఆ సీన్‌లోకి డేవిడ్ వార్నర్‌ను తీసుకొచ్చారు. అల్లు అర్జున్ కోడిపుంజుతో ఉన్న ఫొటోను ఓ అభిమాని మార్ఫింగ్ చేశాడు. ఇక్కడ వార్నర్​ ఓ చేతిలో కోడిపుంజు, మరో చేతిలో బ్యాట్ పట్టుకొస్తున్నట్లు మార్ఫింగ్ చేశారు. అచ్చం వార్నరే ఆ సీన్ చేసినట్టు చేశాడు.

అల దుబాయ్​లో:

అల దుబాయ్​లో:

మార్ఫింగ్ ఫొటోను సదరు అభిమాని ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు. వార్నర్​ భాయ్ మళ్లీ వస్తున్నాడు అని రాసుకొచ్చాడు. 'అల దుబాయ్​లో' అని టైటిల్ పెట్టాడు. కాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోకు డేవిడ్ వార్నర్ స్పందించాడు. పోస్ట్​ను షేర్ చేసి నవ్వుతున్నట్టు ఎమోజీలను పోస్ట్ చేశాడు. ఇక నెటిజన్లు, ఫ్యాన్స్ ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. డేవిడ్ భాయ్ ఐపీఎల్ కోసం దుబాయ్ వచ్చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అల వైకుంఠపురములో' సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్ కొట్టింది. ఈ సినిమాలోని పలు పాటలకు వార్నర్ టిక్ టాక్ చేసాడు.

 భార్య, కూతుళ్లతో కలిసి డ్యాన్స్​లు:

భార్య, కూతుళ్లతో కలిసి డ్యాన్స్​లు:

కరోనా వైరస్ లాక్​డౌన్ కాలంలో తన డ్యాన్స్​లు, సరదా వీడియోలతో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. తెలుగు, తమిళ్, హిందీ పాటలకు భార్య, కూతుళ్లతో కలిసి డ్యాన్స్​లు చేసి భారత అభిమానులను ఎలా మురిపించాడో అందరికీ తెలిసిందే. టిక్‌టాక్‌లో సతీమణి క్యాండిస్‌ వార్నర్‌తో కలిసి బుట్టబొమ్మ, రాములో రాములా, బ్యాంగ్‌బ్యాంగ్‌ వంటి పాటలకు వార్నర్ స్టెప్పులేశాడు. భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించిప్పటికీ.. వార్నర్‌ ఇతర సోషల్‌మీడియా వేదికల ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉన్నాడు.

మరోసారి కెప్టెన్​గా:

మరోసారి కెప్టెన్​గా:

డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని సన్​రైజర్స్ హైదరాబాద్ 2016 ఐపీఎల్ టైటిల్​ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2018లో బాల్​ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురయ్యాక.. వార్నర్​ సన్​రైజర్స్ కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. దీంతో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ జట్టును నడిపించాడు. గతేడాది మళ్లీ వార్నర్ ఐపీఎల్​లో పునరాగమనం చేసి 697 పరుగులతో అదరగొట్టాడు. అయితే ఈ ఏడాది సీజన్ కోసం సన్​రైజర్స్ హైదరాబాద్​ యాజమాన్యం వార్నర్​ను మరోసారి కెప్టెన్​గా నియమించింది. సన్​రైజర్స్​ జట్టుకు మళ్లీ సారథిగా ఎంపికవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, కెప్టెన్సీని తిరిగి పొందాననుకోవట్లేదని ​వార్నర్ అన్నాడు. ఈ సీజన్​లో జట్టుకు మరో టైటిల్​ను అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతామన్నాడు.

'ఫ్రైడే నైట్‌ని ఎంజాయ్ చేయాలి.. ద్రవిడ్‌ను ఔటివ్వండి అంపైర్​'

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, August 8, 2020, 17:35 [IST]
Other articles published on Aug 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X