For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్

David Warner appointed T20 skipper, Jhye Richardson in for South Africa Tests

హైదరాబాద్: ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య త్వరలోనే ముక్కోణపు టీ 20 సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆ సిరీస్‌కు ఎవరెవరు ఆడబోతున్నారో జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను ఎంపిక చేశారు. ఆసీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ విశ్రాంతి కోరిన నేపథ్యంలో వార్నర్‌ను సారథిగా ఎంపిక చేస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ముక్కోణపు సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికా సిరీస్‌లకు ఆసీస్‌ జట్టును తాజాగా ప్రకటించింది. ఇదిలా ఉంచితే, వార్నర్‌ మినహా దాదాపు ఆస్ట్రేలియా టెస్టు జట్టంతా ట్రై-సిరీస్‌కు దూరం కానుండటం గమనార్హం. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఈ పర్యటన నుంచి తనకు చిన్నపాటి విరామం కావాలంటూ స్మిత్‌ విజ్ఞప్తి చేశాడు. ఈ నేపథ్యంలో అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

కాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్‌కు స్మిత్‌ తిరిగి సారథిగా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా జట్టు రెండో స్పిన్నర్‌గా నాథన్ లేన్, ఇప్పటికే రెండు టీ
20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన రిచర్డ్ సన్‌లను ఈ సిరీస్‌కు పరిగణనలోకి తీసుకుంది. కాకపోతే రిచర్డ్ సన్‌కు ఇంగ్లాండ్‌తో ఇది తొలి మ్యాచ్.

ట్వంటీ 20 జట్టు: డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), అరోన్‌ ఫించ్‌, ఆస్టన్‌ ఆగర్‌, అలెక్స్‌ కారే, బెన్‌ డ్వార్‌షూయిస్‌, ట్రావిస్‌ హెడ్‌, క్రిస్‌ లిన్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, డీ ఆర్సీ షార్ట్‌, బిల్లీ స్టాన్‌లేక్‌, స్టోనిస్‌, ఆండ్రూ టై, ఆడమ్‌ జంపా

దక్షిణాఫ్రికా పర్యటనకు ఆసీస్‌ జట్టు: స్టీవ్‌ స్మిత్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌, జాక్సన్‌ బర్ఢ్‌, ప్యాట్‌ కమిన్స్‌, పీటర్‌ హ్యాండ్‌స్కాంబ్‌, హజల్‌వుడ్‌, ఉస్మాన్‌ ఖాజా, నాథన్‌ లయన్‌, మిచెల్‌ మార్ష్‌, షాన్‌ మార్ష్‌, టిమ్‌ పైనీ, జై రిచర్డ్‌సన్‌, మిచెల్‌ స్టార్క్‌

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 22, 2018, 15:20 [IST]
Other articles published on Jan 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+