Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌కు మచ్చ: బాల్ టాంపరింగ్‌‌పై అభిమానులను క్షమాపణ కోరిన వార్నర్

David Warner apologises, says he put stain on game he loves

హైదరాబాద్: బాల్ ట్యాంపరింగ్ ఘటన పట్ల ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తానంతట తానే క్షమాపణలు చెప్పాడు. ఈ ఉదంతంలో వార్నరే కీలక సూత్రధారి. ఈ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఇలా మాట్టాడాడు.చిన్ననాటి నుంచి తనకు క్రికెట్ అంటే ఇష్టమని, కానీ ఆ క్రీడకు మాయని మచ్చ తీసుకువచ్చానని వార్నర్ పశ్చత్తాపపడ్డాడు.

కేప్‌టౌన్‌లో ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ప్లేయర్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. అంత కష్టపడినా మ్యాచ్ గెలవకపోగా.. ఆ ఘటనకు సంబంధించి స్టీవ్ స్మిత్, వార్నర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించింది. సిడ్నీకి తిరిగి వెళ్తున్నానని, క్రికెట్‌కు నష్టాన్ని తీసుకువచ్చేలా తప్పులు చేశానని వార్నర్ తెలిపాడు. మ్యాచ్ గెలిచేందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డాడు.

తాను చేసిన తప్పుకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెబుతున్నానని, దీని వల్ల ఆటకు, అభిమానులకు ఎంత నిరుత్సాహాం కలిగిందో తనకు తెలుసని, ఈ ఘటన నిజంగా క్రికెట్‌కు మచ్చను తీసుకువచ్చిందన్నాడు. అతనిని జట్టు వైస్ కెప్టెన్‌గా అధికారికంగా తొలగించే ముందే ఆ పదవి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. 31 ఏళ్ల వార్నర్‌కు క్లబ్ క్రికెట్ ఆడేందుకు అనుమతి ఉంది. కానీ ఈ ఉదంతం నుంచి కోలుకునేందుకు తనకు కొంత సమయం పడుతుందన్నాడు. కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ ఐడియాను వార్నర్ ఇచ్చాడని తెలుస్తోంది.

బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు స్పాన్సర్‌గా ఉన్న మెజిల్లాన్‌.. బోర్డుతో తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. 'బాల్‌ టాంపరింగ్‌ లాంటి వివాదం కారణంగా ఒప్పందం రద్దు చేసుకోవడం చాలా బాధగా ఉంది' అని మెజిల్లాన్‌ చీఫ్‌ హమీశ్‌ తెలిపారు. ఎల్‌జీ, ఏఎస్‌ఐసీఎస్‌ ఇప్పటికే వార్నర్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌ తప్పించినట్లు ప్రకటించాయి. అలాగే 'వీట్‌ బిక్స్‌' కూడా త్వరలో స్మిత్‌తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ప్రకటించింది.

Story first published: Thursday, March 29, 2018, 13:20 [IST]
Other articles published on Mar 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+