Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

18 నెలలుగా సహజీవనం, ఓ బిడ్డకు తండ్రి... ప్రేయసిని పెళ్లాడిన క్రికెటర్

హైదరాబాద్: ఆస్టేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పెళ్లి కొడుకయ్యాడు. తన ప్రేయసి, మోడల్ కాండిస్ ఫాల్ జోన్‌ను పెళ్లాడాడు. గత 18 నెలలుగా ఫాల్ జోన్‌‌తో సహజీవనం చేస్తున్న వార్నర్ ఒక బిడ్డకు జన్మ కూడా ఇచ్చారు. 12 నెలలు క్రితం ఫాల్ జోన్‌‌తో డేవిడ్ వార్నర్ నిశ్చితార్ధం జరిగింది. వరల్డ్ కప్ అనంతరం ఆమెను సంప్రదాయబద్దంగా వివాహం చేసుకున్నాడు.

వార్నర్ పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆస్టేలియా క్రికెటర్లు బ్రాడ్ హాడిన్, పీటర్ సిడిల్, హెన్రిక్స్ కూడా హాజరయ్యారు. ఇక ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8వ ఎడిషన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు.

David Warner and Candice Falzon marry at Terrara House in Berry

2013లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కుమార సంగక్కర, కామెరూన్‌ వైట్‌ కెప్టెన్సీ చేపట్టారు. ఏడవ ఎడిషన్‌లో తొలుత విండీస్‌ ఆల్‌రౌండర్‌ సామి సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత అతణ్ని తప్పించి శిఖర్‌ ధావన్‌కు కెప్టెన్సీ అప్పగించారు. అయితే 8వ ఎడిషన్ పోటీల ఆరంభానికి ముందే తమ పూర్తి స్థాయి కెప్టెన్‌ అంటూ డేవిడ్‌ వార్నర్‌ పేరును సన్ రైజర్స్ ప్రకటించింది.

వార్నర్‌ ఆటగాడిగా, కెప్టెన్‌గా రాణిస్తాడని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ పేర్కొంది. కాగా, 2015లో పాల్గొంటున్న 8 జట్లలో మూడింటికి ఆస్ర్టేలియా క్రికెటర్లే కెప్టెన్లుగా వ్యవహరించనుండడం విశేషం. రాజస్థాన్‌కు షేన్‌ వాట్సన్‌, పంజాబ్‌కు జార్జి బెయిలీ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+