Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎదురులేని ఓపెనర్లు: ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆసీస్ ఖాతాలో రెండు రికార్డులు!

David Warner, Aaron Finch set new World Cup record

లండ‌న్‌: ప్ర‌పంచ‌కప్ టోర్న‌మెంట్‌లో భాగంగా లార్డ్స్‌లో ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్ సంద‌ర్భంగా రెండు రికార్డులు న‌మోద‌య్యాయి. ఈ రెండూ ఆస్ట్రేలియా ఖాతాలోకే చేరాయి. తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి 123 ప‌రుగుల‌ను జోడించారు ఆస్ట్రేలియా ఓపెనర్లు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్నమెంట్‌లో ఇదో రికార్డు. ఇప్ప‌టిదాకా ఏ జ‌ట్టు కూడా ఇంగ్లండ్‌పై తొలి వికెట్ న‌ష్టానికి 123 పరుగులు చేయ‌లేదు. ఈ ఘ‌న‌త‌ను సాధించారు ఆసీస్ బ్యాట్స్‌మెన్లు.

తొలి వికెట్ న‌ష్టానికి 123 ప‌రుగులు..

తొలి వికెట్ న‌ష్టానికి 123 ప‌రుగులు..

టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌, అరోన్ ఫించ్ భారీ షాట్ల‌తో విరుచుకు ప‌డ్డారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను బెంబేలెత్తించారు. ఈ క్ర‌మంలో డేవిడ్ వార్న‌ర్ అర్థ‌సెంచ‌రీని పూర్తి చేసుకోగా.. అరోన్ ఫించ్ సెంచ‌రీని న‌మోదు చేశాడు. 61 బంతుల్లో ఆరు ఫోర్ల‌తో డేవిడ్ వార్న‌ర్ 53 ప‌రుగులు చేశాడు. జ‌ట్టు స్కోరు 123 ప‌రుగుల వ‌ద్ద వార్న‌ర్ అవుట్ అయ్యాడు. స్పిన్న‌ర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డేవిడ్ వార్న‌ర్‌, అరోన్ ఫించ్ క‌లిసి వికెట్ న‌ష్ట‌పోకుండా వంద‌కుపైగా ప‌రుగులు చేయ‌డం ఈ ప్రపంచ‌క‌ప్‌లో ఇది మూడోసారి. ఇదీ ఓ రికార్డే.

త‌డ‌బ‌డ్డ మిడిలార్డ‌ర్‌..

త‌డ‌బ‌డ్డ మిడిలార్డ‌ర్‌..

వార్న‌ర్ త‌రువాత న్‌డౌన్‌గా వ‌చ్చిన ఉస్మాన్ ఖవాజాతో క‌లిసి మ‌రో భారీ ఇన్నింగ్‌ను నిర్మించాడు ఫించ్‌. 50 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. 29 బంతుల్లో 23 ప‌రుగులు చేసిన ఖ‌వాజా బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

అప్పటికి ఆసీస్ జ‌ట్టు స్కోరు 173. మ‌రో 12 ప‌రుగుల త‌రువాత ఫించ్ అవుట్ అయ్యాడు. 116 బంతుల్లో 100 ప‌రుగులు చేసిన ఫించ్‌ను జోఫ్రా ఆర్చ‌ర్ పెవిలియ‌న్ దారి ప‌ట్టించాడు. ఆర్చ‌ర్ వేసిన బంతిని పుల్ చేయ‌బోయి బౌండ‌రీ లైన్ వ‌ద్ద క్రిస్ వోక్స్ చేతికి చిక్కాడు. 116 బంతుల్లో 11 ఫోర్లు రెండు సిక్స‌ర్ల‌తో స‌రిగ్గా 100 ప‌రుగులు చేశాడు. అనంత‌రం వ‌చ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ వెంట‌నే అవుట్ అయ్యాడు. క్రీజులో ఉన్న కొద్దిసేపూ మెరుపులు మెరిపించాడు. ఎనిమిది బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స‌ర్ స‌హాయంతో 12 ప‌రుగులు చేశారు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వుడ్ వేసిన బౌన్స‌ర్‌ను స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేక‌పోయాడు. త‌ల మీదుగా వెళ్తున్న బంతిని బ్యాట్‌తో తాకించాడు. అది కాస్తా నేరుగా వెళ్లి కీప‌ర్ బట్ల‌ర్ చేతుల్లో వాలింది.

500 ప‌రుగుల మార్క్‌

అర్ధ‌సెంచ‌రీని పూర్తి చేసుకోవ‌డం ద్వారా వార్న‌ర్ ఇంకో రికార్డును నెల‌కొల్పాడు. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్‌లో 500 ప‌రుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాట్స్‌మెన్ అత‌నే. వార్న‌ర్ త‌రువాత 476 ప‌రుగుల‌తో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ష‌కీబుల్ హ‌స‌న్ రెండోస్థానంలో కొన‌సాగుతున్నాడు.

Story first published: Tuesday, June 25, 2019, 18:19 [IST]
Other articles published on Jun 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+