
వార్నర్ వద్దే ఆరెంజ్ క్యాప్
అంతేకాదు టోర్నీలో అత్యధిక పరుగులు(400 పరుగులు) చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ని సైతం సొంతం చేసుకున్నాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ అరుదైన రికార్డుకి చేరువయ్యాడు.

మరో 21 పరుగులు చేస్తే
ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ మరో 21 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున 3000 పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 66 ఇన్నింగ్స్‌లాడిన డేవిడ్ వార్నర్ 2979 పరుగులు నమోదు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఐపీఎల్‌లో మొత్తం 4414 పరుగులు
మొత్తంగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) జట్లకు ప్రాతినిథ్యం వహించిన డేవిడ్ వార్నర్ 4414 పరుగులు సాధించాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలతో పాటు నాలుగు సెంచరీలు ఉన్నాయి. కాగా, ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌కు కూడా డేవిడ్ వార్నర్ ఎంపికయ్యాడు.

వరల్డ్‌కప్ జట్టులో చోటు
ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా 15 మందితో ప్రకటించిన జట్టులో డేవిడ్ వార్నర్ కూడా చోటు దక్కించుకున్నాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన డేవిడ్ వార్నర్ నిషేధం అనంతరం అరంగేట్రం చేసిన మ్యాచ్‌ల్లో సూపర్ ఫామ్‌ని అందుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో సైతం వార్నర్ అదరగొడుతున్నాడు.


Click it and Unblock the Notifications
