Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క‌సి అంతా ఆసీస్‌పై చూపించిన ప్రొటీస్‌!

David Warner 122 goes in vain as South Africa stun Australia

మాంచెస్ట‌ర్: ప్ర‌పంచ‌క‌ప్ మెగా ఈవెంట్‌ను విజ‌యంతో ముగించుకుంది ద‌క్షిణాఫ్రికా. మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో శ‌నివారం జ‌రిగిన త‌న చిట్ట‌చివ‌రి లీగ్ మ్యాచ్‌లో ప్రొటీస్‌.. ఆసీస్‌ను ఖంగు తినిపించింది. 10 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు.. 50 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 325 ప‌రుగుల‌ను చేసింది. భారీ ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన ఆస్ట్రేలియా టీమ్ చివ‌రికంటా పోరాడింది గానీ విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. గెలుపు వాకిట్లో చ‌తికిల ప‌డింది. 49.5 ఓవ‌ర్ల‌లో 315 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఈ ప‌రాజ‌యంతో ఆస్ట్రేలియా జ‌ట్టు.. పాయింట్ల ప‌ట్టిక‌లో రెండోస్థానానికి దిగ‌జారింది. శ్రీలంక‌పై చివ‌రి లీగ్‌లో విజ‌య‌ప‌తాకాన్ని ఎగుర వేసిన టీమిండియా అగ్ర‌స్థానంలో నిలిచింది.

ఆసీసీ..ప‌డుతూ, లేస్తూ!

ఆసీసీ..ప‌డుతూ, లేస్తూ!

326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్ ఏమంత గొప్ప‌గా సాగ‌లేదు. కిందా, మీదా ప‌డిందా టీమ్‌. మూడో ఓవ‌ర్‌లోనే ఓపెన‌ర్ క‌మ్ కేప్టెన్ ఫించ్ వికెట్‌ను కోల్పోయింది. అప్ప‌టికి జ‌ట్టు స్కోరు అయిదు ప‌రుగులే. మ‌రో 15 పరుగులు స్కోరుబోర్డు మీద జ‌త అయ్యే స‌రికి ఇంకో వికెట్‌. ఈ సారి వ‌న్‌డౌన్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖ‌వాజా రిట‌ర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు. జ‌ట్టు స్కోరు 33 ప‌రుగుల‌కు స్టీవ్ స్మిత్‌, 95 ప‌రుగుల వ‌ద్ద స్టాయినిస్‌, 119కు మ్యాక్స్‌వెల్‌.. ఇలా బ్యాట్స్‌మెన్లంద‌రూ పెవిలియ‌న్‌కు వ‌రుస క‌ట్టారు.

ఆదుకున్న లోయ‌ర్ ఆర్డ‌ర్‌..

ఆదుకున్న లోయ‌ర్ ఆర్డ‌ర్‌..

నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల ధాటికి నిల‌బ‌డ‌లేన‌ప్ప‌టికీ.. మ‌రో ఎండ్‌లో డేవిడ్ వార్న‌ర్ పాతుకు పోయాడు. య‌థేచ్ఛగా షాట్లు ఆడాడు. త‌న‌దైన ట్రేడ్ మార్క్ షాట్ల‌తో ఆల‌రించాడు ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్‌. 117 బంతుల్లో 122 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు సిక్స‌ర్లు, 15 ఫోర్లు ఉన్నాయి. అత‌నికి వికెట్ కీప‌ర్ క‌మ్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ కేరీ చ‌క్క‌టి స‌హ‌కారాన్ని అందించాడు. వార్న‌ర్‌తో లాగే ధాటిగా షాట్లు ఆడాడు. జ‌ట్టును విజ‌యానికి ద‌గ్గ‌రగా తీసుకెళ్లాడు. 69 బంతుల్లో ఒక సిక్స‌ర్‌, 11 ఫోర్ల‌తో 85 ప‌రుగులు చేశాడు కేరీ. జ‌ట్టు స్కోరు 225 ప‌రుగుల వ‌ద్ద డేవిడ్ వార్న‌ర్ అవుట్ అయ్యాడు. దీనితో స్కోరుబోర్డులో వేగం మంద‌గించింది.

శ్లాగ్ ఓవ‌ర్ల‌లో క‌ట్టుదిట్టం..

శ్లాగ్ ఓవ‌ర్ల‌లో క‌ట్టుదిట్టం..

చివ‌రి 10 ఓవ‌ర్ల‌లో 90 ప‌రుగులు చేయాల్సిన ద‌శ‌లో డేవిడ్ వార్న‌ర్ అవుట్ కావ‌డం ఆస్ట్రేలియా విజ‌యావ‌కాశాల‌ను దారుణంగా దెబ్బతీసింది. 39.1 ఓవ‌ర్ వ‌ద్ద వార్న‌ర్ ప్రిటోరియ‌స్ బౌలింగ్‌లో క్రిస్ మోరిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీనితో ఆస్ట్రేలియా గెలుపుపై ఇన్నింగ్‌లో మొద‌టిసారిగా అనుమానాలు త‌లెత్తాయి. ఆ త‌రువాత వ‌చ్చిన బ్యాట్స్‌మెన్లెవ‌రూ పెద్ద‌గా నిల‌దొక్కుకోలేక‌పోయారు. ఓ ఎండ్‌లో కేరీ ధాటిగా ఆడుతున్న‌ప్ప‌టికీ.. అత‌నికి సహ‌క‌రించే వారు లేరు. రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగిన ఖ‌వాజా డెత్ ఓవ‌ర్ల‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. త‌డ‌బ‌డ్డాడు. జ‌ట్టు స్కోరు 301 ప‌రుగుల వ‌ద్ద ర‌బ‌డ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంత‌కుముందే- కేరీ అవుట్ కావ‌డం, టెయిలెండ‌ర్లు ధాటిగా ఆడ‌లేక‌పోవ‌డంతో.. 315 ప‌రుగుల వ‌ద్ద ఆలౌట్ అయింది ఆసీస్‌.

చెల‌రేగిన ఫాప్‌, డూసెన్‌

చెల‌రేగిన ఫాప్‌, డూసెన్‌

అంత‌కుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికా వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లో తానేమిటో నిరూపించుకుంది. అస‌లు సిస‌లు ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. ఓపెన‌ర్లు రాణించారు. డికాక్ అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 51 బంతుల్లో ఏడు ఫోర్ల‌తో 52 ప‌రుగులు చేశాడు క్వింట‌న్‌. స్కిప్ప‌ర్ డుఫ్లెసిస్‌, నాలుగో నంబ‌ర్ ఆట‌గాడు డుసెన్ ఆసీస్ బౌల‌ర్ల‌ను ఓ ఆట ఆడుకున్నారు. ఫాప్ సెంచ‌రీ పూర్తి చేసుకోగా.. డూసెన్ 95 ప‌రుగుల‌కు అవుట్ అయ్యాడు. బెహ్రెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో డుఫ్లెసిస్‌, క‌మిన్స్ బౌలింగ్‌లో డూసెన్ అవుట్ అయ్యారు. ఆ త‌రువాత వ‌చ్చిన బ్యాట్స్‌మెన్లెవ‌రూ చెప్పుకోద‌గ్గ ర‌న్లు చేయ‌లేక‌పోయారు.

1
43688

{headtohead_cricket_1_6}

Story first published: Sunday, July 7, 2019, 9:28 [IST]
Other articles published on Jul 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+