డేవిడ్ వార్నర్ 100: స్మిత్‌కు మద్దతుగా వ్యాఖ్యలు
హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో వన్డే గురువారం జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ నాలుగో వన్డే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే వార్నర్‌కు ఇది 100వ వన్డే.
ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ బుధవారం మీడియాతో మాట్లాడాడు. 'నాకు, నా కుటుంబానికి నిజంగా ఇది ఓ మైలురాయి. ఆసీస్ తరుపున ఒక్క గేమ్ అయినా ఆడాలనేది నా కల. అలాంటిది వన్డేల్లో ఈరోజు నేను ఎక్కడైతే ఉన్నానో.. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మ్యాచులో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా' అని వార్నర్ అన్నాడు.
'ఇంత సుదీర్ఘకాలం పాటు రాణిస్తానని కలలో కూడా అనుకోలేదు. నా కెరీర్ మొదట్లో ఎంతో నేర్చుకున్నా. టీ20 క్రికెట్ మాదిరి కాకుండా గేమ్‌ను ఎలా ఆడాలో నేర్చుకున్నా. నాలుగు రోజుల క్రికెట్‌తో పాటు టెస్టు క్రికెట్‌ను ఎలా ఆడాలో కూడా నేర్చుకున్నా' అని వార్నర్ తెలిపాడు. 2009లో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం చేసిన వార్నర్ ఇప్పటి వరకు 99 వన్డేల్లో 4,093 పరుగులు చేశాడు.

స్మిత్‌తో తనకున్న అనుబంధంపై వార్నర్
ఇక కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో తనకున్న అనుబంధంపై కూడా వార్నర్ స్పందించాడు. 'స్మిత్ ఇటీవలే వందో వన్డేని ఆడాడు. గత కొన్ని సంవత్సరాలుగా స్మిత్‌తో స్నేహం కొనసాగుతోంది. ఇద్దరం కలిసి వందో వన్డే ఆడటం చాలా గర్వంగా ఉంది' అని వార్నర్ అన్నాడు. ఇక, ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ రోడ్నీహాగ్ చేసిన సంచలన వ్యాఖ్యలకు గాను స్మిత్‌కు వార్నర్ మద్దతుగా నిలిచారు.

రోడ్నీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వార్నర్
జట్టులోకి తన స్నేహితులను ఎంపిక చేస్తున్నాడని రోడ్నీ చేసిన వ్యాఖ్యలపై వార్నర్ స్పందించారు. 'ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. ఎవరినీ తప్పు పట్టడానికి వీల్లేదు. ఇది సెలక్టర్లకు కూడా వర్తిస్తోంది. జట్టును సెలక్టర్లు మ్యాచ్ ముందు రోజు ఎంపిక చేస్తారు. జట్టులో స్థానం దక్కించుకోవడం అనేది ఆటగాడి చేతిలో ఉండదు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడమే వారి చేతిలో ఉంటుంది' అని వార్నర్ అన్నాడు.

3-0తో సిరిస్‌ను కైవసం చేసుకున్న భారత్
ఐదు వన్డేల సిరిస్‌ను 3-0తో మరో రెండు వన్డేలు మిగిలుండగానే ఆసీస్ ఓటమి పాలవడంతో స్మిత్‌పై పలువురు ఆసీస్ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ క్రికెటర్ రోడ్నీ హాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు స్మిత్ తనకు నచ్చిన వారిని జట్టులోకి తీసుకుంటున్నాడని ఆరోపించారు.

స్మిత్ తన స్నేహితులను జట్టులోకి తీసుకుంటున్నాడు
'స్మిత్ తన స్నేహితులను జట్టులోకి తీసుకుంటున్నాడు. అతను కెప్టెనేగానీ సెలక్టర్ కాదు. తని ధోరణిపై ఆస్ట్రేలియా సెలక్షన్ ప్యానల్ వెంటనే విచారణ చేపట్టాలి. అగర్‌ని అలాగే తీసుకున్నాడని, రెండు వన్డేలు ఫెయిలైన కార్ట్‌రైట్ ఇంకా జట్టుతోనే కొనసాగుతున్నాడు. జట్టులో ఎంపికైన మాడిసన్ కూడా అతని ఫ్రెండే' అని హాగ్ అన్నాడు.

తుది జట్టులో ప్రతిభావంతులకు స్థానం కల్పించు
'వీళ్లంతా స్మిత్‌కు క్లోజ్. నువ్వు వాళ్లనే తీసుకుంటే ఎలా? దీనిపై సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్మిత్.. దయచేసి తుది జట్టులో ప్రతిభావంతులకు స్థానం కల్పించు. నీ సొంత ఆలోచనలకు పోవద్దు. మైదానంలో కెప్టెన్ బాధ్యతలు నిర్వహించి జట్టుకు విజయాలను అందించు' అని హాగ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications