For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కావ్యపాప జట్టుపై విరుచుకుపడిన ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్!

కొత్త ఏడాది వేళ దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సిక్సర్ల వర్షంతో అభిమానులను హుషారెత్తించారు. SA20 లీగ్ నాలుగో సీజన్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ప‌ర్ల్ రాయల్స్ కెప్టెన్ డేవిడ్ మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు ఈ సీజన్‌లో మొదటి విజయాన్ని అందించారు. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌పై మిల్లర్ విధ్వంసం చూసి ఢిల్లీ క్యాపిటల్స్ (DC) యాజమాన్యం పండగ చేసుకుంటోంది.

కావ్య మారన్ జట్టుకు చుక్కలు చూపించిన మిల్లర్
ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ జట్టు అయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ విశ్వరూపం చూపాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ టీమ్ 150 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో పర్ల్ రాయల్స్ టీమ్ కేవలం 35 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మార్కో యాన్సెన్, అన్రిచ్ నోర్ట్జే ధాటికి రాయల్స్ కుప్పకూలుతుందనుకున్న సమయంలో డేవిడ్ మిల్లర్ క్రీజులోకి వచ్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు.

David Miller Match-Winning Knock Thrills Delhi Capitals Fans in SA20 League

ఉత్కంఠ పోరులో పర్ల్ రాయల్స్ విజయం
డేవిడ్ మిల్లర్ కేవలం 38 బంతుల్లోనే 71 పరుగులు(నాటౌట్) చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మిల్లర్‌కు తోడుగా కీగన్ (45) నిలకడగా ఆడటంతో వీరిద్దరూ ఐదో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్లినా, మిల్లర్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే సిక్సర్‌తో జట్టును గెలిపించారు. ఈ మెరుపు ఇన్నింగ్స్ చూసిన ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఐపీఎల్ 2026 వేలంలో ఢిల్లీ కేవలం రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌కే మిల్లర్‌ను దక్కించుకోవడం విశేషం.

మార్కో యాన్సెన్ రికార్డు
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిపోయినా, ఆ జట్టు బౌలర్ మార్కో యాన్సెన్ ఒక అరుదైన రికార్డు సృష్టించారు. SA20 చరిత్రలో 50 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా ఆయన నిలిచారు. అలాగే 19 ఏళ్ల కుర్రాడు నకోబాని మోకోనా 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

Story first published: Thursday, January 1, 2026, 14:30 [IST]
Other articles published on Jan 1, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+